కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం రేపింది. పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు సిబ్బందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇక్కడ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. బ్రీతింగ్ ఎనలైజర్‌కు వాడే పైపును మార్చే క్రమంలో సిబ్బందికి కరోనా సోకినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీస్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించాలంటే భయపడుతున్నారు.