ప్రధాని భద్రతా లోపంపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీం కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన ప్యానెల్‌లో జస్టిస్ (రిటైర్డ్) ఇందు మల్హోత్రా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ మరియు పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సభ్యులుగా ఉంటారు. ప్రధాని భద్రతా ఉల్లంఘనకు గల కారణాలు, దానికి బాధ్యులైన వ్యక్తులు & VVIPల భద్రతా ఉల్లంఘనలను నిరోధించడానికి భవిష్యత్తులో తీసుకోవలసిన చర్యలపై ప్యానెల్ విచారిస్తుందని పేర్కొంది.
ఇటీవల పంజాబ్లోని ఫిరోజ్ పూర్ పర్యటనకు వెళ్లిన ప్రధానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రతను కల్పించలేకపోయింది. ఆందోళనకారుల నిరసనలతో ఓ ఫ్లైఓవర్ పై దాదాపుగా ప్రధాని కాన్వాయ్ 20 నిమిషాల పాటు నిలిచిపోవడం ఆందోళన కలిగించింది. ఈ అంశంపై సుప్రీం కోర్ట్ లో మణిందర్ సింగ్ అనే సీనియర్ న్యాయవాది పిటీషన్ దాఖలు చేయడంతో.. సుప్రీం కోర్ట్ ప్రధాని భద్రత లోపంపై ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.