మోత్కూర్ మున్సిపాలిటీలో శుక్రవారం 236 మంది విద్యార్థులకు కరోనా టీకా వేసినట్లు మండల వైద్య అధికారులు తెలిపారు. మోత్కూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 140 మంది విద్యార్థులకు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 96 మంది విద్యార్థులకు కరోనా రెండవ డోస్ టీకా వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. జిల్లాలో ప్రజలందరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్య సిబ్బంది సూచించారు.