వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం చెన్నారంలో ఓప్రేమ వివాహం కన్నవాళ్ళ ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేక అమ్మాయి తల్లిదండ్రులు కుమారస్వామి, కవిత పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వరంగల్ ఎంజీఎంకు తరలించగా తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. వేరు వేరు కులాలు కావడం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.