రష్యా- ఉక్రెయిన్ వార్: 10 వేల మంది రష్యన్ సైనికులను హతమార్చిన ఉక్రెయిన్

-

రష్యా- ఉక్రెయిన్ మధ్య 11 వరోజు యుద్ధం భీకరంగా సాగుతోంది. ఓ వైపు చర్చలకు రెండు దేశాలు వెళ్తున్నా.. యుద్ధం యుద్ధమే, చర్చలు చర్చలే అన్న రీతిలో వ్యవహరిస్తోంది రష్యా. ఇదిలా ఉంటే యుద్ధంలో రష్యా తన అధునాతన సైనిక సంపత్తిని, సైనికులను కోల్పోతోంది. ఉక్రెయిన్ సేనలు రష్యాకు చుక్కులు చూపెడుతున్నాయి. రష్యాకు తమ సత్తా ఏమిటో చూపిస్తున్నారు. వందలాది రష్యా సైనికులను బందీలుగా పట్టుకుంటున్నారు. ప్రజలు కూడా సహకరిస్తుండటంతో రష్యా సేనలకు చావు దెబ్బ తప్పడం లేదు.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు 10 వేల మంది రష్యన్ సైనికులను హతమార్చామని ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. రష్యాకు చెందిన 269 యుద్ధ ట్యాంకులను , 945 సాయుధపోరాట వాహనాలను, 105 ఆర్టిలరీ వ్యవస్థలను, 39 యుద్ధ విమానాలను, 40 హెలికాప్టర్లను కూల్చినట్లు పేర్కొంది. మరోవైపు రష్యాకు వ్యతిరేఖంగా పోరాడేందుకు 65 వేల మంది ఉక్రెయిన్లు విదేశాల నుంచి స్వదేశానికి చేరుకున్నారని రక్షణ శాఖ వెల్లడించింది. 

మరోవైపు యుద్ధం భీకరంగానే సాగుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఉక్రెయిన్ లో అణ్వాయుధాలు నాశనం అయ్యే వరకు పోరాడుతామని.. మా లక్ష్యం నెరవేరే వరకు పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. మరో వైపు ఉక్రెయిన్ ను నోఫ్లై జోన్ గా ప్రకటిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని.. ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ఎవరైనా ఈ నిర్ణయం తీసుకుంటే మాతో యుద్ధం చేయడానికి సిద్ధం అయినట్లే అని వ్యాఖ్యానించారు.

బెలారస్ వేదికగా జరుగున్న చర్చల్లో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. ఇప్పటికే రెండు దఫాలుగా చర్చలు జరిగాయి. రేపు మూడో విడత చర్చలకు రెండు దేశాలు సిద్ధం అవుతున్నాయి. ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పేందుకు తాము సిద్ధం అంటూనే… మా డిమాండ్లకు ఒప్పుకోవాలని ఉక్రెయిన్ కు అల్టిమేటం జారీ చేస్తున్నారు పుతిన్.

Read more RELATED
Recommended to you

Latest news