![Bandi Sanjay Kumar | బండి సంజయ్](https://cdn.manalokam.com/wp-content/uploads/2021/07/Bandi-Sanjay-Kumar-బండి-సంజయ్.jpg)
ప్రజల దృష్టి మరల్చేందుకే టిఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రధాని మోడీ కాంగ్రెస్‌ను విమర్శిస్తే టిఆర్ఎస్‌కు అభ్యంతరమెందుకంటూ ప్రశ్నించారు. ప్రజల దృష్టి మరల్చేందుకే టిఆర్ఎస్ నాయకులు నిరసనలు చేస్తున్నారన్నారు. తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పుడు ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ వద్దన్న ద్రోహులనే ఇవాళ కేసీఆర్ చేరదీశారన్నారు.