వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. కాగా మాస్కులు ధరించిన భక్తులను మాత్రమే ఆలయంలోకి అధికారులు అనుమతిస్తున్నారు.