జగిత్యాల బస్టాండులో శనివారం భావోద్వేగ సన్నివేశం చోటు చేసుకుంది. యుద్ధ భూమిగా మారిపోయిన ఉక్రెయిన్ నుంచి తిరిగి వస్తున్న కొడుకు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన తల్లి, చెల్లి.. కొడుకు బస్సు దిగగానే హత్తుకుని ఏడ్చేశారు. క్షేమంగా తిరిగి రావాలంటూ క్షణమొక యుగంలా ఆందోళన చెందుతూ గడిపిన వీరు.. కొడుకు పవన్ కుమార్ కన్పించగానే.. ఆనంద భాష్పాలు రాలుస్తూ బిగ్గరగా ఏడ్చేశారు.
Karimnagar: జగిత్యాల: ‘మాతృ హృదయం.. భావోద్వేగం..!’
-