రాజ్యాంగ పరిరక్షణ కోసం త్వరలో పాదయాత్ర చేస్తానని తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు ఆచార్య కోదండరాం అన్నారు. ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని పీఎస్ఆర్ గార్డెన్స్ లో జరిగిన తెజస 2వ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం మొత్తం ఒక్కరిద్దరి చేతిలోనే ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కూడా ప్రభుత్వం కోట్లు కొల్లకొట్టిందన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబానికే పరిమితమైందని వాపోయారు.