భూంపల్లి, రుద్రారం, మోతే శివారులో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ పనులను పరిశీలించి, చెక్ డ్యాం పనులను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మార్చి నెలాఖరులో కూడవెల్లి వాగులోకి మల్లన్నసాగర్ నీటిని విడుదల చేసి రైతుల పంట పొలాలకు నీరు అందజేస్తామన్నారు. ఎంపీ వెంట మండల టిఆర్ఎస్ నాయకులతో పాటు భూంపల్లి టిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.