కొనసాగుతున్న‘ ఆపరేషన్ గంగ’… రొమేనియా నుంచి ఇండియాకు వచ్చిన ఐదో విమానం

-

ఉక్రెయిన్- రష్యా మధ్య భీకర యుద్ధం సాగుతోంది. దీంతో ఉక్రెయిన్ లో విద్యను అభ్యసిస్తున్న భారతీయుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. దీంతో ఇండియా విదేశాంగశాఖ భారతీయులను స్వదేశానికి తరలించే కార్యక్రమాన్ని చేపట్టింది. ‘ ఆపరేషన్ గంగా’ పేరుతో భారతీయులను ఉక్రెయిన్ నుంచి ఏయిరిండియా విమానాల ద్వారా తరలిస్తున్నారు. రోమేనియా రాజధాని బుకారెస్ట్, హంగేరి రాజధాని బుడాపెస్ట్, పోలాండ్ దేశాల ద్వారా.. భారతీయులను తరలిస్తున్నారు. 

తాజాగా బుకారెస్ట్ నుంచి ఐదవ విమానం ఢిల్లీకి చేరుకుంది. 249 మందితో ఫ్లైట్ ఢిల్లీకి వచ్చింది. ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి 1156 మంది విద్యార్థులు ఇండియాకు చేరుకున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు మాత్రమే బోర్డర్లు క్రాస్ చేసుకుని పోలాండ్, రొమేనియా వైపు వస్తున్నారు. ఇదిలా ఉంటే తూర్పు ప్రాంతంలో ఉన్న భారతీయులు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. కీవ్ నగరంతో పాటు ఇతర నగరాల్లో కూడా భారీ స్థాయిలో పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఉక్రెయిన్ పౌరులతో పాటు ఇండియన్స్ అక్కడే బంకర్లలో తలదాచుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news