విశాఖ సాగర తీరంలో మిలాన్‌-2022…చరిత్రలో ఇదే తొలిసారి

-

విశాఖ తీరంలో… మిలాన్‌–2022 వేడుకలను ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. మొట్టమొదటి సారిగా విశాఖ సాగర తీరంలో మిలాన్‌-2022 నిర్వహణ చరిత్రలో మైలు రాయిగా నిలిచిపోతుందని సీఎం జగన్‌ తెలిపారు. తూర్పు నావికాదళంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్‌ విశాఖ చేరడం మనకు గర్వకారణమన్నారు.

వైజాగ్‌.. సిటీ ఆఫ్‌ డెస్టినీ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమని… ఈ ప్రాంతం సంప్రదాయానికి ప్రతీక అని వివరించారు. విశాఖ చరిత్రలో ఇది మైలురాయని… ఇది అరుదైన యుద్ధ నౌకల విన్యాసాల పండగ అని చెప్పారు జగన్‌. ఈ మిలాన్‌లో 39 దేశాలు పాల్గొనడం గర్వకారణమన్నారు వైఎస్‌ జగన్‌.

విశాఖ సాగర తీరంలో 39 దేశాలతో కలసి భారత నావికాదళం, తూర్పు నావికాదళం నిర్వహించిన విన్యాసాలు.. దేశ సైన్యం పట్ల మరింత నమ్మకాన్ని, అభిమానాన్ని పెంచుతాయని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. పూర్తి స్వదేశీయంగా యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్‌ విశాఖ’ను రూపొందించడం ఎంతో సంతోషమన్నారు. ఐఎన్‌ఎస్‌ విశాఖ యుద్ధ నౌక కొద్ది నెలల క్రితం నావికాదళంలో చేరిందని… పీ 15 బీ క్లాసెస్‌ గైడెడ్‌ మిసైల్‌ స్టెల్త్‌ డిస్ట్రాయర్‌ సాంకేతికతో పనిచేసే ఈ యుద్ధ నౌక తూర్పు నావికాదళంలోకి చేరడం ఎంతో గర్వకారణమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news