మగ్దూంపల్లి క్రాస్ రోడ్ వద్ద ఘోర ప్రమాదం

accident

మునిపల్లి మండలం మగ్దూంపల్లి క్రాస్ రోడ్డు 65వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెడ్డి లాబరేటరీ డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలు దేరి రోడ్డుగుండా వెళ్తుండగా మగ్దూంపల్లి క్రాస్ రోడ్ వద్ద గుర్తుతెలియని వాహనం అజిమోదిన్ అనే వ్యక్తిని ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.