
సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం నర్సాయిపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్ లు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం కూటిగల్ గ్రామానికి చెందిన ఇద్దరికి, చేర్యాల మండలం ఆకునూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్కి గాయాలయ్యాయి.