మియాపూర్ డివిజన్ లో పర్యటించిన చేవెళ్ల ఎంపీ

శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మియాపూర్ డివిజన్ లో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు అరికెపూడి గాంధీతో కలిసి విస్తృతంగా పర్యటించారు. వారు డివిజన్ పరిధిలోని నడిగడ్డ తాండ, సుభాష్ చంద్ర బోస్ నగర్ కాలనీల్లో పాదయాత్ర చేపట్టి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించే విధంగా సత్వర చర్యలు చేపట్టాలని అక్కడున్న అధికారులను ఆదేశించారు.