సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా తెలంగాణ గేట్ వే పేరుతో మేడ్చల్ జిల్లా కండ్లకోయలో.. నూతన ఐటీ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ. 100 కోట్లతో భారీ స్థాయిలో దీన్ని నిర్మిస్తున్నారు. 10 ఎకరాల స్థలంలో 40 మీటర్ల ఎత్తు, 14 అంతస్థులతో ఐటీ పార్కు నిర్మాణం రూపొందించనున్నారు. ఐటీ పార్కులో 70 కంపెనీల ద్వారా దాదాపు 50 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.