నల్గొండ: ఇంటర్‌ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు

ఏప్రిల్‌లో జరగనున్న ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపును ఇంటర్‌ బోర్డు పొడిగించింది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా వచ్చే నెల 4వరకు చెల్లించవచ్చని, ఆ తర్వాత రూ.200రుసుముతో వచ్చే10 వరకు, రూ.1000తో 17వరకు, రూ.2వేలతో 24వ తేదీ వరకు చెల్లించవచ్చని ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు.