బార్లు, వైన్ ద్వారా రాని కరోనా….. స్కూళ్ల ద్వారానే వస్తుందా..?- ఆర్. కృష్ణయ్య

థర్డ్ వేవ్ ముప్పు ముంచుకురావడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగానే విద్యాలయాలను మూసి వేసింది. కేవలం ఆన్ లైన్ చదువులకు మాత్రమే అనుమతి ఇస్తోంది. అయితే కొన్ని వర్గాలు మాత్రం సూళ్లను ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కరోనా, లాక్ డౌన్ ల కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. అయితే తాజా స్కూళ్లను మూసివేయడంపై జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు స్పందించారు. కరోనా వల్ల మూతపడ్డ స్కూళ్లను వెంటనే తెరవాలని ప్రభుత్వాన్ని కృష్ణయ్య డిమాండ్ చేశారు.

 కరోనా పేరుతో బడులు మూసి వేయడం సరికాదన్నారు. మాల్స్ , థియేటర్లు, బార్లు, వైన్ షాపుల ద్వారా రాని కరోనా.. కేవలం స్కూళ్లను తెరిస్తేనే వస్తుందా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా కారణంగా ఇప్పటికే విద్యార్థులు రెండేళ్లు నష్టపోయారని, విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించడంతో లాభం లేదని ఆయన అన్నారు. విద్యార్థులు నష్టపోకుండా స్కూళ్లను ఓపెన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.