నల్గొండ : ఉద్యోగ ప్రకటనపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బుధవారం ప్రకటించిన 80 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ విషయంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. 2018 ఎలక్షన్ లో నిరుద్యోగులకు రూ. 3,116 నిరుద్యోగ భృతి ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. పైగా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 80 వేల పైచిలుకు ఉద్యోగాలే భర్తీ చేస్తామని ప్రకటించడం సిగ్గుచేటు అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.