నల్గొండ: ఈ నెల 30 వరకు ఆన్ లైన్ తరగతులు

online classes
online classes

నల్గొండ జిల్లాలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలలకు ఈ 30వ వరకు సెలవులను పొడిగించడం జరిగిందని రిజిస్టార్ ప్రొఫెసర్ విష్ణుదేవ్ తెలిపారు. ఈ నెల 17 నుంచి 30వ వరకు డిగ్రీ, పీజీ కోర్సుల తరగతులను ఆన్ లైన్‌లో బోధించాలన్నారు. అందుకుగాను ప్రిన్సిపాల్స్ అందరూ సిబ్బందిని ఆన్లైన్ క్లాసులకు సిద్ధం చేయాలని సూచించారు. ఎంజీయూలో విధులు నిర్వహించే వారు యూనివర్సిటీలో ప్రతిరోజు హాజరుకావాలన్నారు.