యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన స్వామి వారిని గోవర్ధనగిరిధారుడిగా అలంకరించారు. ప్రకృతి బీభత్సం నుంచి భక్తులను కాపాడే భక్తజన బాంధవుడిగా శ్రీకృష్ణుడి లీలలను ప్రతిబింభించే గోవర్ధన గిరిధారిగా ఏకశిఖర వాసుడైన యాదాద్రీశుడు దర్శనమిచ్చి తరింపజేశాడు. శ్రీకృష్ణుడు తన ఎడమచేతి చిటికెన వేలుపై గోవర్థన పర్వతాన్ని ఎత్తి గోపాలులను రక్షించిన మహిమలను అర్చకులు వివరించారు.