మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి గురువారం భక్తులు తరలివస్తున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా ఛత్తీస్ గడ్, ఆంధ్ర, మహారాష్ట్ర ఇతర సుదూర ప్రాంతాల నుండి భక్తులు ప్రైవేటు వాహనాలు, ఆర్టిసి బస్సులలో తరలివస్తున్నారు. నేడు సమ్మక్క సారలమ్మ దర్శనానికి 56 వేల మంది భక్తులు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. జంపన్న వాగు ప్రాంతం భక్తులతో నిండిపోయింది. వనదేవతల గద్దెల వద్ద రద్దీ నెలకొంది.