వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

accident
accident

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూడూరు మండలం బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఛీలాపూరు స్టేజి సమీపంలో ఉన్న పెట్రోల్ పంపు వద్ద ద్విచక్ర వాహనాన్ని.. బొలెరో బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్నవారు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మేడికొండ గ్రామానికి చెందిన పి యాదిరెడ్డి (50), సాకలి రవి(32)లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.