పవన్ కళ్యాణ్ చేసిన రోడ్ మ్యాప్ వాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆచితూచి స్పందించాడు. 2024 ఎన్నికల కోసం తిరుపతి మీటింగ్ లోనే అమిత్ షా దిశానిర్థేశం చేశారని అన్నారు. రెండు నెలల క్రితమే మాకు రోడ్ మ్యాప్ ఇచ్చారని.. అందులో భాగంగానే పార్టీని బలోపేతం చేస్తున్నామని అన్నారు. పవన్ కళ్యాన్ మా కేంద్రం పార్టీ ప్రతినిధులతో టచ్ లో ఉన్నారని… మిత్రపక్ష పార్టీ అధ్యక్షుడుగా ఆయనతో కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు. మరోవైపు టీడీపీతో పోత్తు ఉంటుందా.. అన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. పెండింగ్ ప్రాజెక్ట్ ల కోసం నియోజకవర్గాల వారీగా భారీ సభలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ప్రాజెక్టులకు గేట్లు మెయింటైన్ చేయడానికి నిధులు, సిబ్బందిని కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైందని సోము వీర్రాజు ఆరోపించారు. ఈనెల 19న రాయలసీమ రణభేరి ఉంటుందని ఆయన అన్నారు. రాయలసీమ నుంచి ఎంత మంది ముఖ్యమంత్రులు వచ్చిన సాగు విస్తీర్ణం 19లక్షల ఎకరాలు దాటలేదని.. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వస్తాం అని ఆయన అన్నారు.