
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్లోనే మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు వికారాబాద్ జిల్లా నవపేట్ మండలం ఎల్లకొండ గ్రామానికి చెందిన నర్సింహులు, రామచంద్రయ్య, శ్యామయ్యలుగా పోలీసులు గుర్తించారు. వీరు ఏడుపాయల దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది