
రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా రావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. ఇన్‌స్పెక్టర్ ఆదేశాల మేరకు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ కరోనా నిబంధనలను పాటించే విధంగా చర్యలు చేపడుతున్నారు.