వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో జాతీయ పక్షి అయిన ఎనిమిది నెమళ్లు మృతి చెందిన విషాద ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పర్వతగిరి మండల కేంద్రం శివారు దేవిలాల్ తండాలో ఎనమిది నెమళ్లు మృత్యువాత పడ్డాయి. విషగుళికలు కలిసిన నీటిని తాగడంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు, సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.