వారం రోజుల కిందట… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 23 జిల్లాలుగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఉన్నట్టుండి జిల్లాలపై ప్రభుత్వం ప్రకటన చేయడంతో…. చాలా వర్గాలు, ప్రాంతాల నుంచి వ్యతిరేకత వస్తోంది.
ఇది ఇలా ఉండగా జిల్లాల పునర్విభజనలో భాగంగా మచిలీపట్నం కూడా కొత్త జిల్లాగా ఏర్పడనుంది. అయితే ఆ జిల్లాకు దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలని అక్కినేని అభిమానులు అభ్యర్థన చేస్తున్నారు. ఏపీ సర్కార్ తమ కోరికను దృష్టిలో పెట్టుకోవాలని ఆలిండియా అక్కినేని అభిమానుల సంఘం అధ్యక్షుడు సర్వేశ్వరరావు కోరుతున్నారు.
గుడివాడ రామాపురం లో జన్మించిన అక్కినేని నాగేశ్వరరావు విభిన్న పాత్రలో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ఏఎన్ఆర్ ఎక్కడో మద్రాస్లో ఉన్న చిత్ర ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చారు. ఇలా చిత్ర పరిశ్రమకు ఎన్నో రకాల సేవలను అక్కినేని నాగేశ్వర అందించారు. ఈ నేపథ్యంలోనే మచిలీపట్నం జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ పెరుగుతోంది.