తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలను పునఃప్రారంభం చేసేందుకు కేసీఆర్ సర్కార్ సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి యధావిధిగా విద్యాసంస్థలను తెరవాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలు మరియు విద్యా సంస్థలకు కేసీఆర్ సర్కార్ సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మరో రెండు రోజుల్లో విద్యాసంస్థలకు ప్రకటించిన సెలవులు ముగియనున్నాయి.
ఈ నేపథ్యంలో విద్యా సంస్థలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పున ప్రారంభిస్తుందా ? లేక సెలవులను మరింత కాలం పొడిగిస్తుందా ? అనే సందేహం అందరిలోనూ ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలను ప్రారంభించాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
విద్యా సంవత్సరం తుది దశకు వచ్చిన నేపథ్యంలో తరగతులను ప్రారంభిస్తే నే మంచిదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు అర్థమవుతోంది. దీనిపై ఇవాళ సాయంత్రం కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా కరోనా నేపథ్యంలో విద్యా సంస్థలకు జనవరి 16వ తేదీ నుంచి సెలవులను 31వ తేదీ వరకు పొడిగించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.