వరంగల్: టిఆర్ఎస్ నేతలను అరెస్టు చేయాలని ధర్నా

వరంగల్: బీజేపీ నాయకులపై దాడులకు తెగబడుతున్న టిఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి వారిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని హన్మకొండ జిల్లా ఖిలా వరంగల్‌లోని ఎమ్మార్వో కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.