ఈ నెల 20 బుధవారం నుండి జిల్లాలో మాస్క్ లేకుండా పబ్లిక్ ప్లేస్ లలో తిరిగే వారి పై 1000 రూపాయల ఫైన్ విధించి మూడో దశ కరోనా వైరస్ బారినపడకుండా జిల్లా ప్రజలను అప్రమత్తం చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.కరోనా మూడో వేవ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు.