బావిలో దూకి వివాహిత ఆత్మహత్య

బావిలోకి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన గీసుకొండ మండలంలో చోటు చేసుకుంది. షరీఫ్ తో రేష్మా(28)కు వివాహమైంది. భర్త తాగుడు బానిస కావడంతో తరుచూ వారి మద్య గొడవలు జరుగుతుండేవి, దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఈనెల10న బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. తన భార్య కనిపించడం లేదని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆమె మృతదేహం బావిలో లభించింది.