హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం ఎల్లాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బియ్యం బస్తా లోడుతో వేగంగా వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో చిత్తరు ఐలుకుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మండలంలోని ఫ్లై ఓవర్ మీద ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు, వాహనంలో ఇరుకున్న మృతున్ని అతికష్టం మీద బయటికి తీశారు. అక్కడ రోదనలు మిన్నంటాయి.