కావాలనే చైనా ‘కరోనా’ను తయారుచేసిందా..?

-

నిజమే అయితే, ఇంతకన్నా ఘోరం ప్రపంచ చరిత్రలో ఇంకోటి లేదు. ఇంతకన్నా దరిద్రపు దేశం ఇంకోటి ఉండదు. వాళ్లను వారి ప్రజలే రాళ్లతో కొట్టి చంపేస్తారు.

వుహాన్‌ నగరం… మధ్య చైనాలోని హుబే ప్రావిన్స్‌లో కీలకమైన నగరం. చాలా అందంగా ఉంటుంది. నగరాన్ని యాంగ్జే నది రెండుగా విడదీస్తుంటుంది. సెంట్రల్‌ చైనాలో అధిక జనాభా కలిగిన నగరం. వుచాంగ్‌, హంకూ, హన్యాంగ్‌ పట్టణాలను కలిపి నిర్మించి ఆ మూడు పేర్లు కలిగిఉండేలా ‘‘వుహాన్‌’’ అని పేరు పెట్టారు. మధ్య చైనాలో ఆర్థిక, విద్యా, వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా వుహాన్‌ను పరిగణిస్తారు. అతిపెద్ద రవాణా కేంద్రంగా, వుహాన్‌ చైనాలోని అన్ని ప్రధాన నగరాలతో రోడ్డు, వైమానిక, రైలు మార్గాలున్నాయి. అందుకే దీన్ని ‘‘చికాగో ఆఫ్‌ చైనా’’ గా కూడా వ్యవహరిస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద జలవిద్యుచ్చక్తి డ్యామ్‌గా పేరొందిన ‘ త్రీ గోర్జెస్‌ డ్యామ్‌’ ఇక్కడే యాంగ్జే నదిపై ఉంది.
దశాబ్దాలుగా తయారికేంద్రంగా విలసిల్లుతున్న వుహాన్‌లో, 3 జాతీయ అభివృద్ధి జోన్లు, 4 శాస్త్ర-సాంకేతిక అభివృద్ధి పార్కులు, 350 పరిశోధనాకేంద్రాలు, 1656 అత్యున్నత సాంకేతిక సంస్థలు, లెక్కలేనన్ని ఇంక్కుబేటర్‌ సంస్థలు, ఫార్చూన్‌ 500 కంపెనీల పెట్టుబడులున్నాయి. 2018లో ఈ ఒక్క నగరమే 22.8 బిలియన్‌ డాలర్ల జిడిపిని సంపాదించింది. దాదాపు ఒక కోటి పది లక్షల మంది జనాభాతో చైనాలో 9వ అధిక జనాభా కలిగిన నగరంగా పేరొందింది.

ఇక్కడున్న ప్రతిష్టాత్మక పరిశోధనా కేంద్రాల్లో ఒకటి…. వుహాన్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ. చైనా అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో నడిచే ఈ కేంద్రం, 1956లో ప్రారంభించబడింది. చైనాలో ఉన్న ఒకే ఒక్క బయో సేఫ్టీ లెవెల్‌-4 ప్రయోగశాలను 2015లో ఇందులోనే నిర్మించారు. ఫ్రెంచివారి సహకారంతో నిర్మించిన ఈ ల్యాబ్‌లోనే సార్స్‌, మెర్స్‌ లాంటి కరోనా వైరస్‌లపై ప్రయోగాలు చేస్తుంటారు.

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నవ్య కరోనా (సార్స్‌-కొవ్‌-2SaarS-Cov2) లేదా కొవిడ్‌-19 వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న సముద్రాహార తయారీ కేంద్రం, ఈ ల్యాబ్‌కు కేవలం 20 మైళ్ల ‘దూరం’లోనే ఉంది. ఎన్నో రకాల వైరస్‌ల ప్రతి నిత్యం ఇక్కడ పరిశోధనలు జరుగుతూఉంటాయి. వాటికి విరుగుడు వ్యాక్సిన్‌లను కనిపెట్టడం ఈ ల్యాబ్‌ ప్రధాన బాధ్యత. ‘‘విచిత్రం’’గా అదే నగరంలో ఈ కరోనా వైరస్‌ పుట్టి, దాన్ని నాశనం చేసి, ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. అయితే కరోనా వైరస్‌ పుట్టుకపై అమెరికా, చైనా పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్నాయి. మీరే సృష్టించారంటే, మీరేనని దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. నిజమేదైనా, కొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానాలు నేటికి కూడా దొరక్కపోవడం సందేహాస్పదంగా ఉంది.

ఈ ప్రశ్నలకు బదులేది?

ఒకే దేశం. ప్రధాన నగరాలు… వుహాన్‌, షాంఘై, బీజింగ్‌, గాంగ్జూ… వుహాన్‌ నుంచి ఈ మూడు నగరాలకు ప్రతినిత్యం లక్షలాదిమంది బుల్లెట్‌ రైళ్లలో, విమానాలలో రాకపోకలు జరువుతుంటారు. విశేషమేమిటంటే, ఆ మూడు నగరాలలో కరోనా ‘‘లేదు’’. అక్కడే కాదు, మిగిలిన చైనా ప్రధనా భూభాగంలో ఎక్కడా కరోనా లేదు. ఎలా..?

ఉత్తర కొరియా, రష్యా… చైనాకు అత్యంత మిత్రదేశాలు. అమెరికాతో శత్రుత్వం వలన ‘శత్రువుకు శత్రువు మిత్రుడు’ అన్న కాన్సెప్ట్‌లో ఇవి ఆప్తమిత్రులయ్యాయి. ఉత్తర కొరియా అధికారిక ప్రకటన ప్రకారం ఆ దేశంలో ఈ వైరస్‌ ‘‘లేదు’’. మరో మిత్రదేశం రష్యాలో ఇప్పటివరకు ఒక్క మరణమూ లేకుండా 495 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. అంత పెద్ద దేశంలో కరోనా వ్యాప్తి అంత నెమ్మదిగా ఎందుకుంది? మరణాలు ఎందుకు లేవు?

వుహాన్‌లోని ఆసుపత్రులలో 86000 మంది కరోనా పేషెంట్లుండగా, 79000 మందికి తగ్గిపోయి, ఇంటికెళ్లిపోయారు. కేవలం ఆరేడు వేల మందే ఇంకా హాస్పిటల్స్‌లో ఉన్నారు. చాలా ఆసుపత్రులను మూసేసామని చైనా అధికారికంగా ప్రకటించింది. ఇంత తొందరగా అన్ని వేల మందికి కరోనా ఎలా నయమైంది?

ఈనెల 10న వుహాన్‌లో పర్యటించిన అధ్యక్షుడు జిన్‌ పింగ్‌, వైరస్‌ను తాము జయించామని పేర్కొన్నారు. అందుకు తగ్గట్లు ఆయన కేవలం ఫేస్‌ మాస్క్‌ తప్ప ఇతర రక్షణ కవచాలేవీ ధరించలేదు. ఎందుకు?

గత కొన్ని రోజులుగా కొత్తగా కేసులేవీ రాలేదని చెప్పిన చైనా, మళ్లీ మూడు రోజుల క్రితం 46 కొత్త కేసులు నమోదయ్యాయని ప్రకటించింది. పైగా వారంతా విదేశీయులేనని చెప్పింది. అంతర్జాతీయ సరిహద్దులు మూసేసిన రెండు నెలల తర్వాత ఇప్పుడు కొత్తగా విదేశీయులు ఎక్కన్నుంచి వచ్చారు? వారిని అసలు దేశంలోకి ఎలా అనుమతించారు?

కరోనా గతి తప్పిన జీవాయుధమా.?

చాలామంది సైంటిస్టులు, వైరాలజీ నిపుణులు ఆరోపిస్తున్నట్లు ఈ వైరస్‌ను వుహాన్‌ ల్యాబ్‌లో చైనాయే సృష్టించిందా అనేది ఇప్పుడు మిలియన్‌ డాలర్‌ ప్రశ్నలా మిగిలింది. అమెరికన్‌ సెనేటర్‌ ఇదే సంచలనాత్మక ఆరోపణ చేసారు. కరోనా వైరస్‌ అనేది పక్కదారి పట్టిన జీవాయుధమనేది ప్రధాన ఆరోపణ. జన్యుక్రమాన్ని మార్చి తయారుచేసిన జీవాయుధమని, అయితే ఆ ప్రయోగం విఫలం కావడంతో ఈ వైరస్‌ జనించిందని ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంపై అమెరికా గుత్తాధిపత్యాన్ని సహించలేని చైనా ఆ హోదా తనకు దక్కాలని గత కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న రహస్య ప్రయోగాల ఫలితమే ఈ కరోనా అని రక్షణ రంగ నిపుణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. సార్స్‌ వైరస్‌కు, కరోనాకు పోలిక చెబుతున్నారు. సార్స్‌ నెమ్మదిగా వ్యాపించే వైరస్‌ కాగా, కరోనా చాలా వేగంగా వ్యాపిస్తుంది. అయితే సార్స్‌ చాలా ప్రమాదకారి. మరణాల రేటు సార్స్‌లో ఏకంగా 9.6శాతం ఉంటే, కరోనాలో 2.3శాతం మాత్రమే.కానీ, విస్తృత వ్యాప్తి వలన ప్రభుత్వాలు డీల్‌ చేయలేనివిధంగా తయారవుతోంది. ఫలితమే ఇటలీ, స్పెయిన్‌, అమెరికాలు ఏమీ చేయలేని స్థితిలో భోరుమంటున్నాయి. ప్రపంచదేశాలు లక్షలాది కోట్ల డాలర్లను కరోనా ప్యాకేజీలుగా విడుదల చేస్తున్నాయి. తద్వారా తమ ఆర్థిక పరిస్థితులను దిగజార్చుకుంటున్నాయి. ఇదే చైనాకు కావల్సిందని ట్రేడ్‌ వార్‌ నిపుణుల అంచనా.

ప్రస్తుతం వుహాన్‌ నగరంలోనే కాకుండా, మొత్తం హుబే రాష్ట్రంలో రవాణా ఆంక్షలు చైనా ఎత్తివేసింది. ప్రజలు మళ్లీ తిరగడం, ఆఫీసులు తెరవడం చేస్తున్నారు. ఇంత తొందరగా (మూడున్నర నెలలు) తగ్గి ప్రజాజీవితం మామూలుగా మారిపోయిందంటే నిజానికి ఆశ్యర్యంగా లేదూ..!

ఏదేమైనా, కరోనా సృష్టి, వ్యాప్తిలో చైనా ప్రత్యక్ష హస్తం ఉందని ప్రపంచదేశాలకు తెలిస్తే, ఏ ఒక్కటి ఆ దేశాన్ని క్షమించలేవు. అంతెందుకు? వుహాన్‌ ప్రజలే జిన్‌పింగ్‌ మొహంపై ఉమ్మేస్తారు. ఇన్ని వేల ప్రాణాల ఉసురు తప్పక చైనాకు తగులుతుంది. ఏదోనాటికి ఆ పాపం పండకపోదు. చైనా ఆ శిక్ష అనుభవించకాపోదు.

 

రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Latest news