అత్యాచారం నుంచి ఉరి వరకు… ఏం జరిగింది…!

-

నిర్భయ అత్యాచార దోషులను తీహార్ జైల్లో ఉదయం 5;30 నిమిషాలకు అధికారులు ఉరి తీసారు. దీనితో దేశ వ్యాప్తంగా మహిళలు, పిల్లా పెద్దా అనే తేడా లేకుండా అందరూ న్యాయవ్యవస్థను కొనియాడుతున్నారు. నిర్భయకు న్యాయం జరిగిందని, ఆమె ఆత్మ శాంతించింది అంటూ సోషల్ మీడియా సహా ప్రధాన మీడియాలో పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఈ కేసులో ముందు నుంచి ఏం జరిగింది…?

కదులుతున్న బస్సులో డిసెంబర్ 16, 2012న ఆమె స్నేహితుడి తో కలిసి వెళ్తున్న నిర్భయపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారం చేసారు. ఆమెపై దాడికి దిగారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడటంతో ఆమెను సఫ్దార్ గంజ్ ఆస్పత్రిలో చేర్పించారు. మరుసటి రోజు అంటే 17 వ తేదీన దేశం మొత్తం నిరసనలు వ్యక్తమయ్యాయి. ఘటన దోషులను పోలీసులు గుర్తించారు. ముందు నిందితులు రామ్ సింగ్, ముఖేష్, వినయ్ శర్మ, పవన్ గుప్తాలను పోలీసులను గుర్తించారు.

20వ తేదీన నిర్భయ స్నేహితుడి వాంగ్మూలం తీసుకున్న అధికారులు, మరుసటి రోజు కేసులో ఆరో నిందితుడిగా అక్షయ్ ఠాకూర్ ని గుర్తించి, బీహార్ వెళ్లి అతన్ని అరెస్ట్ చేసారు. 22 వ తేదీన అతడ్ని ఢిల్లీ తీసుకొచ్చి స్టేట్ మెంట్ తీసుకున్నారు. 25 వ తేదీన బాధితురాలి ఆరోగ్యం విషమించింది. 26 వ తేదీన ఆమెను మెరుగైన వైద్యం కోసం సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో 29వ తేదీన నిర్బయ మరణించారు. దోషులపై హత్య కేసు కూడా నమోదు చేసారు.

జనవరి 2 2013 లో నాటి చీఫ్ జస్టీస్ అల్తమాస్ లైంగిక దాడుల కేసుల విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయించారు. 7 వ తేదీ నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లో విచారణ మొదలయింది. మార్చ్ 11 న నిందితుల్లో ఒకడు రామ్ సింగ్ తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగస్ట్ 31 న మైనర్ నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించారు. సెప్టెంబర్ 13 న మిగిలిన నిందితులకు మరణ శిక్ష విధించారు. మార్చ్ 15 న 2014 న సుప్రీం కోర్ట్ మరణ శిక్షపై సుప్రీం కోర్ట్ స్టే విధించింది. మే5న నిందితుల మరణ శిక్షను సుప్రీం కోర్ట్ సమర్ధించింది.

మే 4న వినయ్ శర్మ, పవన్ గుప్తా రివ్యూ పిటిషన్లపై తీర్పుని సుప్రీం కోర్ట్ రిజర్వ్ చేసింది. అదే ఏడాది జులై 9న ముగ్గురు నిందితుల పిటీషన్ ని కొట్టేసింది కోర్ట్ 2019 ఫిబ్రవరిలో నిందితులకు మరణశిక్షపై వారెంట్ కోరుతూ ఢిల్లీ కోర్టులో నిర్భయ తల్లిదండ్రుల పిటిషన్ దాఖలు చేసారు. డిసెంబర్ 10, 2019లో తన మరణశిక్షను సమీక్షించాలని సుప్రీంకోర్టులో అక్షయ్ ఠాకూర్ పిటీషన్ దాఖలు చేసాడు. డిసెంబర్ 13 న అక్షయ్ పిటీషన్ ని కోర్ట్ తిరస్కరించింది. 18న అక్షయ్ పిటిషన్‌ ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

జనవరి 22న నలుగురు నిందితులను ఉరి తీయాలని జనవరి 7 2019న ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. 9న సుప్రీంకోర్టులో నిందితుడు ముఖేష్ క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసాడు. అదే రోజున మరో నిందితుడు నిందితుడు వినయ్ కుమార్ క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసాడు. 14 వ తేదీన రాష్ట్రపతి వద్దకు ముఖేష్ క్షమాభిక్ష పిటీషన్ ని దాఖలు చేసాడు. 14 వ తేదీన వినయ్ శర్మ, ముఖేష్ క్యురేటివ్ పిటిషన్లను సుప్రీం కొట్టేసింది. జనవరి 14 న డెత్ వారెంట్‌పై ఢిల్లీ కోర్టును ముఖేష్ ఆశ్రయించాడు.

క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున తన ఉరి శిక్ష వాయిదా వేయాలని ముఖేష్ కోరాడు. జనవరి 17న ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్ ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. 17వ తేదీన ఫిబ్రవరి 1 న వాళ్ళను ఉరి తీయాలని ఢిల్లీ కోర్ట్ డెత్ వారెంట్ ఇచ్చింది. జనవరి 18న నేరం జరిగిన సమయంలో తాను జువైనల్ అంటూ సుప్రీం కోర్ట్ లో పవన్ గుప్తా పిటీషన్ దాఖలు చేసాడు. జనవరి 20న పవన్ పిటీషన్ ని కోర్ట్ కొట్టేసింది. జనవరి 25న రాష్ట్రపతి క్షమాభిక్ష పిటీషన్ ని రద్దు చేయడంపై ముఖేష్ సుప్రీం కోర్ట్ కి వెళ్ళాడు.

జనవరి 28న సుప్రీం కోర్ట్ లో నిందితుడు కోర్ట్ లో క్యూరేటివ్ పిటీషన్ దాఖలు చేసారు. జనవరి 29న రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను రద్దు చేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ముఖేష్ పిటిషన్ ని కోర్ట్ కొట్టేసింది. రాష్ట్రపతికి జనవరి 29 న వినయ్ శర్మ క్షమాభిక్ష పెట్టుకున్నాడు. జనవరి 30న ఫిబ్రవరి 1 ఇచ్చిన డెత్ వారెంట్ ని నిలిపివేయాలని ఢిల్లీ కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. జనవరి 20న అక్షయ్ క్యూరేటివ్ పిటీషన్ ని కొట్టేసింది కోర్ట్.

జనవరి 31న తన జువైనల్ పిటిషన్‌ను కొట్టేయడంపై సుప్రీంకోర్టులో పవన్ గుప్తా రివ్యూ పిటిషన్ వేసాడు. 31 పవన్ గుప్తా రివ్యూ పిటిషన్ ని సుప్రీం కోర్ట్ కొట్టేసింది. జనవరి 31 న డెత్ వారెంట్ ను వాయిదా వేసింది ఢిల్లీ కోర్ట్. ఫిబ్రవరి 1 న ట్రయల్ కోర్ట్ తీర్పుకి వ్యతిరేకంగా కేంద్రం హైకోర్ట్ కి వెళ్ళింది. ఫిబ్రవరి 5 న నిందితులు అందరిని ఒకేసారి ఉరి తీయాలని ఢిల్లీ హైకోర్ట్ ఆదేశించింది. ఫిబ్రవరి 5న అక్షయ్ క్షమాభిక్ష పిటీషన్ ని తోసిపుచ్చారు రాష్ట్రపతి. ఫిబ్రవరి 11 న తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడంపై సుప్రీంకోర్టులో వినయ్ రిట్ పిటీషన్ వేసాడు.

ఫిబ్రవరి 14న వినయ్ శర్మ పిటిషన్ ని సుప్రీం కోర్ట్ తోసి పుచ్చింది. ఫిబ్రవరి 17న మార్చి 3 నిందితులకు డెత్ వారెంట్ ఢిల్లీ కోర్ట్ జారీ చేసింది. ఫిబ్రవరి 20న ఢిల్లీ ఎన్నికల కోడ్, వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉందంటూ ఎన్నికల కమిషన్‌కు నిందితులు ఫిర్యాదు చేసారు. ఫిబ్రవరి 28న తన మరణశిక్షను యావజ్జీవ శిక్ష గా మార్చాలను సుప్రీం కోర్ట్ లో పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసాడు. ఫిబ్రవరి 29న రాష్ట్రపతి వద్ద మళ్ళీ క్షమాభిక్ష పిటీషన్ ని అక్షయ్ పెట్టుకున్నాడు. మార్చ్ 2న పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ ని సుప్రీం కోర్ట్ కొట్టేసింది.

మార్చ్ 2న నిందితుల మరణశిక్ష అమలుపై ఢిల్లీ కోర్టు స్టే ఇచ్చింది. మార్చ్ 4న పవన్ గుప్తా క్షమాభిక్ష పిటీషన్ ని రాష్ట్రపతి కొట్టేసారు. మార్చి 20న నిందితులను ఉరి తీయాలంటూ ఢిల్లీ కోర్టు మార్చ్ 5 న డెత్ వారెంట్ ఇచ్చింది. మార్చ్ 12 న తమ వారిని క్షమించాలని నిందితుల కుటుంబ సభ్యులు రాష్ట్రపతికి లేఖ రాసారు. మార్చ్ 16న తమ శిక్షపై స్టే విధించాలంటూ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించారు ముగ్గురు నిందితులు. మార్చ్ 18న ట్రయిల్ కోర్టు ఆర్డర్‌ను ఢిల్లీ హైకోర్టులో ముఖేష్ సింగ్ సవాల్ చేసాడు.

బీహార్ కోర్టులో విడాకుల పిటిషన్ ని అక్షయ్ సింగ్ భార్య దాఖలు చేసింది. మార్చ్ 19న తన క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చడంపై సుప్రీంకోర్టును ని అక్షయ్ ఆశ్రయించాడు. మార్చ్ 19న ఢిల్లీ హైకోర్ట్ ఆదేశాలను సవాల్ చేస్తూ అక్షయ్ వేసిన పిటీషన్ ని సుప్రీం కోర్ట్ కొట్టేసింది. మార్చ్ 19న మార్చి 20న డెత్ వారెంట్‌పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ పాటియాలా కోర్టు నిరాకరించింది. మార్చ్ 19న రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చడంపై సుప్రీంకోర్టులో అక్షయ్ వేసిన పటిషన్ కొట్టేసారు. మార్చ్ 19న నిందితుల శిక్ష అమలుపై స్టే ఇవ్వడానికి కారణాలు సరిగా లేవని ఢిల్లీ కోర్ట్ స్పష్టం చేసింది. మార్చ్ 20 ఉదయం 5;30 న తీహార్ జైల్లో ఉరి శిక్ష అమలు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news