చంద్ర‌బాబుకు భారీ షాక్‌..? టీడీపీకి గుడ్‌బై చెప్పనున్న గంటా..? ఆ పార్టీలోనే చేరుతార‌ట‌..?

-

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలోనే ఆ పార్టీని వీడి వైసీపీలో చేరనున్న ట్లు తెలిసింది. గంటా వైకాపాలో చేరాలని చూస్తున్నారని, అందుకనే ఆయన అసెంబ్లీలో వైకాపాను పల్లెత్తు మాట అనడం లేదని టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమి పాలైనప్పటి నుంచి ఆ పార్టీ భవిష్యత్తు ఏమిటని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీలో ఉన్న నేతలంతా ఇతర పార్టీల్లో చేరితే ఎలా అన్న విష‌యం కూడా టీడీపీ అధినేత చంద్రబాబును మరింత కలవరానికి గురిచేస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 స్థానాలు రావడంతో ఏ పార్టీ మద్దతు అవసరం లేకుండానే స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే జగన్ తమకు ఏ పార్టీ నేతలు అవసరం లేదని తెలిపారు. ఒకవేళ ఎవరైనా తమ పార్టీలోకి రావాల‌నుకుంటే ఎమ్మెల్యే పదవుల‌కు రాజీనామాలు చేసి ముందుకు రావాలని చెప్పారు. దీంతో గతంలో కొందరు నేతలు టీడీపీని వీడి వైకాపాలో చేరాలంటే భయపడ్డారు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది.

ganta srinivasa rao might leave tdp and join in ysrcp very soon

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలోనే ఆ పార్టీని వీడి వైసీపీలో చేరనున్న ట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఓ వైపు చంద్రబాబు తీవ్ర నిరాశలో ఉంటే మరోవైపు పార్టీలో కొందరు నేతలు ప్రవర్తిస్తున్న తీరు ఆయ‌న్ను కలవరపెడుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే గంటా అసెంబ్లీలో వైకాపాను ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు, సైలెంట్ గానే ఉంటున్నారు. ఈ క్రమంలో గంటా వ్యవహారశైలిపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటా వైకాపాలో చేరాలని చూస్తున్నారని, అందుకనే ఆయన అసెంబ్లీలో వైకాపాను పల్లెత్తు మాట అనడం లేదని టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

అయితే వైసీపీలో చేరాలనుకునే ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినా స‌రే.. త‌మ పార్టీకి రాజీనామా చేసి రావాలని జగన్ చెప్పడంతో గంటా కూడా అదే దారిలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలిసింది. విశాఖ సిటీలో గంటాకు చాలా బ‌లం ఉండ‌డంతో అది త‌మ‌ పార్టీకి కలిసి వస్తుందని జగన్ కూడా భావిస్తున్నారట. అందుకని గంటాను వైసీపీలో చేర్చుకోవాల‌ని కూడా జ‌గ‌న్ చూస్తున్నార‌ట‌. ఇక గంటా చేరికను వైసీపీ నేతలు ఆహ్వానిస్తున్న‌ట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి త్వ‌ర‌లోనే వైసీపీలో చేరవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే ఏపీలో ఉప ఎన్నిక రావ‌డం ఖాయంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా గంటా టీడీపీని వీడితే ఆ పార్టీ అధినేతకు బలమైన షాక్‌ తగులుతుంద‌ని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Read more RELATED
Recommended to you

Latest news