‘సన్నాసుల మఠం కాదు’ – కేసీఆర్ లో అసహనం

-

తెలంగాణ వచ్చిన మరుసటి నుంచే ఇక నుంచి మాది ‘ఫక్తు’ రాజకీయ పార్టీయే అని కేసీఆర్ చెప్పినమాట ఎవరూ మర్చిపోలేరు. ఏ ఎన్నిక‌లైన తిరుగులేని శక్తి అనుకుంటూ త‌మ గురించి గొప్ప‌గా చెప్పుకునే టీఆర్ఎస్ పార్టీ అధినేత మాట‌లో ఎంతో తేడా వ‌చ్చింది. కేవ‌లం ఒక ఎమ్మెల్యే సీటు కోసం ఎందుకు ఇంత‌గా అస‌హ‌నానికి గురవుతున్నాడు?    మా పార్టీ ‘ సన్నాసుల మఠం’ కాదని ఎందుకు అంటున్నారని అందరూ తలలు గోక్కుంటున్నారు. కానీ దానికి కొన్ని లాజిక్ లు ఉన్నాయిలే.

కేసీఆర్ | KCR
కేసీఆర్ | KCR

1). కాంగ్రెస్ లో ఉంటూ టీఆర్ఎస్ కోవర్టు గా పనిచేసిన కౌశిక్ రెడ్డి ని పార్టీలో చేర్చుకోవడం.
2) మంచి మంచి నాయకుల చేరిక కూడా కేటీఆర్ చేత జరిపించే వారు. కానీ కోవర్టు అపవాదు మోస్తున్న కౌశిక్ కు కండువా కప్పేందుకు స్వయంగా కేసీఆరే రావడం, చూసేవారికి ఎబ్బెట్టుగా అనిపించిన విషయమే.
3). ఉప ఎన్నిక జరుగనున్న హుజూరాబాద్ కే పరిమితం చేస్తూ దళిత బంధు అమలు చేస్తామనడం . అది ఓట్ల పథకంగా కేసీఆర్ మార్చుకుంటున్నాడని అన్ని వైపుల నుంచి విమర్శలు రావడం తెలిసిందే.
4) ఓ మెట్టు దిగి కౌశిక్ కు శాలువా కప్పడం,దళిత బంధు పథకాన్ని ఉప ఎన్నిక ఉన్న చోటనే ముందుగా అమలు చేస్తామనడం లాంటివే ‘తమది సన్నాసులు మఠం కాద’ని కేసీఆర్ నోట అనిపించాయని చెప్పొచ్చు.

ఏదేమైనా రాజేందర్ పై కేసీఆర్ పెంచుకున్న అసహన రాజకీయమే ఆయన చేత సన్నాసుల మఠం కాదని చెప్పించాయి. మాది రాజ‌కీయ పార్టీ కాబ‌ట్టి ఎలాంటి కోవ‌ర్టు రాజ‌కీయాలైనా చేస్తాం.. గెలుపే ముఖ్యం.. గెలుపు కోసం ఏం చెయ్య‌డానికైనా సిద్ధం అని చెప్ప‌డానికి వెన‌కాడ‌టం లేదు కేసీఆర్‌.  అందులో బాగంగా ఒక అడుగు ముందుకేసి స‌న్నాసుల మ‌ఠం కాదంటూ చెప్ప‌కొచ్చారు.  హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో గెలిచినా ఓడినా ప్ర‌భుత్వానికి వ‌చ్చిన న‌ష్ట‌మేమీలేదు. కానీ ఈటెల‌పైన ఉన్న కోపం ఎంత‌కైనా తెగించేలా చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఒక్క ఈటెల‌ను ఓడించేందుకు ఇన్నిన్ని వేల కోట్లు వెచ్చించడం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల ప్ర‌శ్న‌.

ఈట‌ల బ‌లం నిజంగా తెలిసిన వ్య‌క్తి కేసీఆరే. అందుకే ఇంత‌గా ఇబ్బంది ప‌డుతున్నారు. ఏం చేసినా ఈట‌ల‌ను ఓడించ‌డం క‌ష్టం అందుకే ఏం చేసైనా గెల‌వాల‌న్న క‌సి కనిపిస్తున్న‌ది.  కానీ ఒక రాష్ట్ర సాధకుడుగా పేరున్న కేసీఆర్ నుంచి ఇలాంటి అనైతిక తెగింపు చర్యలు, మాటలను ప్రజలు మాత్రం ఊహించరు, హర్షించరు. కేసీఆర్ అసహనం ధోరణి పరోక్షంగా రాజేందర్ కే ప్రజల సానుభూతి మరింత పెరగొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news