ఏపీలో మరోసారి పదవుల జాతర.. వారికి కీలక బాధ్యతలు

అమ‌రావ‌తి : ఏపీలో మరోసారి పదవుల జాతర నెలకొంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప‌లు కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ ల‌ను నియ‌మిస్తు ఉత్త‌ర్వులు జారీ చేసింది జగన్ ప్ర‌భుత్వం. ఏపిఎస్ఆర్టీసి ఛైర్మ‌న్ గా ఏ. మల్లిఖార్జున రెడ్డిని నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసిన జగన్ సర్కార్.. ఏపి సివిల్ స‌ప్ల‌య్స్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ గా ద్వారంపూడి భాస్క‌ర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం.. రెండేళ్ల పాటు ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు ద్వారంపూడి భాస్క‌ర్ రెడ్డి. అలాగే.. ఏపి హ‌స్త‌క‌ళ‌ల డెవ‌లప్ మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ గా బి. విజ‌య‌లక్ష్మిని…ఏపీ ఖాధీ మ‌రియు విలేజ్ ఇండ‌స్ట్రీస్ బోర్డ్ ఛైర్మ‌న్ గా పి. భాగ్య‌మ్మ నియామ‌కం చేసింది సర్కార్. వీరిద్దరూ కూడా రెండేళ్ల పాటు ప‌ద‌విలో కొన‌సాగనున్నారు. అటు ఏపీ ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా కర్రా గిరిజా నియామకం అయ్యారు. ఈయన కూడా రెండేళ్ల పాటు ప‌ద‌విలో కొన‌సాగనున్నారు.