నిజానికి నిర్భయ చట్టం ప్రకారం.. 12 ఏళ్ల లోపు బాలికలపై లైంగిక దాడికి పాల్పడినా.. హత్య చేసినా.. వాళ్లకు ఉరి శిక్ష విధించాలి. అలా అయితే.. శ్రీనివాస్ రెడ్డికి ఎన్నిసార్లు ఉరిశిక్ష విధించాలి. ఎన్నిసార్లు అతడిని ఉరితీయాలి.
హజీపూర్.. ఈ గ్రామం పేరు గత కొన్ని రోజులుగా తెలంగాణ మీడియాలో మార్మోగిపోతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చిన్న ఊరు అది. కానీ.. ఆ ఊళ్లో జరిగిన బాలికల హత్యల మిస్టరీ ఇప్పుడిప్పుడే వీడుతోంది. దీంతో ఆ గ్రామం ప్రస్తుతం సెన్సేషన్ అయింది.
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు అమ్మాయిలను పొట్టనబెట్టుకున్నాడు సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి. ఇవి తెలిసినవి మాత్రమే. తెలియని ఘోరాలు ఎన్నో. సైకోగా మారి.. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా.. అత్యంత పాశవికంగా వాళ్లపై అఘాయిత్యం చేసి చంపేసిన శ్రీనివాస్ రెడ్డిని ఏం చేయాలి. ఇప్పుడు ఇదే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మదిలో మెదులుతున్న ఆలోచన. అతడే ఒప్పుకున్నాడు. తానే ఈ మూడు హత్యలు చేశానని. కానీ.. ఈ సైకో కిల్లర్‌ను చూస్తుంటే మూడు హత్యలే కాదు.. ఇంకా చాలా తప్పుడు పనులు చేసి ఉంటాడు. ఇటువంటి మానవ మృగాలు రోడ్డు మీద తిరిగితే చిన్న పిల్లలకు కూడా రక్షణ ఉండదు.
నిజానికి నిర్భయ చట్టం ప్రకారం.. 12 ఏళ్ల లోపు బాలికలపై లైంగిక దాడికి పాల్పడినా.. హత్య చేసినా.. వాళ్లకు ఉరి శిక్ష విధించాలి. అలా అయితే.. శ్రీనివాస్ రెడ్డికి ఎన్నిసార్లు ఉరిశిక్ష విధించాలి. ఎన్నిసార్లు అతడిని ఉరితీయాలి. ఇప్పుడు శ్రీనివాస్‌రెడ్డి.. రేపు ఇంకెవరో.. ఎల్లుండి మరెవరో.
శ్రీనివాస్‌రెడ్డి పోయినంత మాత్రాన అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలు ఆగుతాయా? నెవ్వర్.. ఆగవు. కానీ.. శ్రీనివాస్ రెడ్డి ఒక ఉదాహరణ కావాలి. హాజీపూరే ఒక సాక్ష్యం కావాలి. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడితే బతుకు దుర్భరం అవుతుంది.. అన్న భయం కామాందుల్లో కలగాలి. కామాందులు.. ఇంకోసారి ఏ అమ్మాయిపైనైనా అఘాయిత్యం చేయాలంటేనే వణికిపోవాలి. అలాంటి భయం వాళ్లలో రావాలంటే.. శ్రీనివాస్‌రెడ్డికి అంతటి పెద్ద శిక్ష విధించాలి. అది ఏది.. ఉరి శిక్షా.. ఇంకేంటి. సంవత్సరాలకు సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిప్పి వాయిదాలు వేయడం కాకుండా.. శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే ఉరి తీసేలా కోర్టులు తీర్పు ఇవ్వాలి. అలా చేస్తే అయినా.. ఇలాంటి చర్యలకు పాల్పడాలని అనుకునే వాళ్లు దడుసుకుంటారు. ఇటువంటి పాశవిక పనులు కొంతైనా తగ్గే అవకాశం ఉంది.