45 ఏళ్ల రాజకీయ జీవితం..14 ఏళ్ల సీఎం..మరో 14 ఏళ్ళు ప్రతిపక్ష నేత..ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాల్లో చక్రం తిప్పిన నాయకుడు. అపర చాణక్యుడుగా పేరొందిన నేత..ఒకానొక కాలంలో ఆయన రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్ధులు గిలగిలాడేవారు. కానీ ఇప్పుడు ఆయనే విలవిల అంటున్నారు. కేవలం ఒకేసారి సిఎం అయిన జగన్ చేతిలో బాబు రాజకీయ జీవితం ఆఖరి దశకు వచ్చేసింది. 1978 నుంచి రాజకీయంగా తిరుగులేని విజయాలు అందుకుంటూ..కాంగ్రెస్ లో కీలక పదవులు అనుభవించి..తర్వాత ఎన్టీఆర్ వద్దకు వచ్చి..ఆయనకు అల్లుడై..తర్వాత టిడిపిలో కీలకంగా ఉన్నారు.
ఆఖరికి ఎన్టీఆర్‌ని సైతం పక్కన పెట్టి టిడిపితో పాటు సిఎం పదవి సొంతం చేసుకున్నారు. అలా చేసిన సరే 1999 ఎన్నికల్లో మళ్ళీ బాబుకు ప్రజలు పట్టం కట్టారు. ఆ సమయంలో ఇటు రాష్ట్రంలోనే కాదు..అటు కేంద్రంలో కూడా బాబు హవా ఉంది. ఇక 2004, 2009 ఎన్నికల్లో రాజకీయంగా ఇబ్బందులు పడ్డారు. వైఎస్సార్ దెబ్బకు ఓటమి పాలై..ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. అయినా సరే వెనక్కి తగ్గలేదు. మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకున్నారు.
ఓ వైపు వైఎస్సార్ సెంటిమెంట్ తో జగన్ …వైసీపీతో దూసుకెళుతున్న..2014 ఎన్నికల్లో జగన్‌కు చెక్ పెట్టి విభజన తర్వాత ఏపీకి సిఎం అయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో జగన్ చేతిలో చావు దెబ్బతిన్నారు. పార్టీ కూడా దారుణంగా దెబ్బతినే పరిస్తితి. అలాంటి పరిస్తితి నుంచి మళ్ళీ పార్టీని పైకి తీసుకోస్తూ..రాజకీయంగా చంద్రబాబు సైతం బలపడుతున్న తరుణం.
కానీ ఈ సమయంలోనే జగన్ అదిరిపోయే వ్యూహాలతో బాబు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అనూహ్యంగా గత టిడిపి హయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బాబు బుక్ అయ్యారు. ఇప్పుడు అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్నారు. ఎప్పుడు బయటకొస్తారో తెలియని పరిస్తితి. దీంతో టిడిపిలో నైరాశ్యం నెలకొంది. ఈ పరిస్తితులు చూస్తే బాబు శకం ఇంకా సమాప్తం అయ్యే దశలో ఉందని చెప్పవచ్చు. అయితే 2024 ఎన్నికలు ఆఖరి ఛాన్స్. ఆ ఎన్నికల్లో గెలిస్తే సరే..లేదంటే బాబు శకం ముగిసినట్లే.