ఎడిట్ నోట్: ప్రజానాడిలో మార్పు.?

-

తెలంగాణలో ప్రజానాడి మారుతుందా? ప్రజలు ఇంతకాలం బి‌ఆర్‌ఎస్ పార్టీని ఆదరిస్తూ వచ్చారు. ఈ సారి కాంగ్రెస్ వైపు చూస్తున్నారా? అంటే కొన్ని సర్వేలు చూస్తుంటే అవుననే చెప్పవచ్చు. అదే సమయంలో బి‌ఆర్‌ఎస్ బలం పెద్దగా తగ్గలేదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ 88 సీట్లు గెలుచుకుంది..తర్వాత కాంగ్రెస్, టి‌డి‌పి ఎమ్మెల్యేలని తీసుకుని 100 దాటేసింది. అయితే అప్పుడు బలం ఇప్పుడు మాత్రం కనిపించడం లేదు. నిదానంగా ఆ బలం సగానికి సగం తగ్గిందనే వాదనలు వస్తున్నాయి.

కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండటం వల్లే ఈ పరిస్తితి ఉందని తెలుస్తోంది. అదే సమయంలో మొన్నటివరకు రేసులో ఉన్న బి‌జే‌పి ఒక్కసారిగా డౌన్ అవ్వడం కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. పైగా కాంగ్రెస్ లోకి వలసలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచాయి. అలాగే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ప్రజలని ఆకర్షిస్తున్నాయి. వాటిపై బి‌ఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నా..ప్రజలు మాత్రం గ్యారెంటీలపై నమ్మకం పెట్టుకున్నట్లే కనిపిస్తుంది. అందుకే కాంగ్రెస్ గ్రాఫ్ నిదానంగా పెరుగుతున్నట్లే తెలుస్తోంది.

TS Assembly Elections 2023

తాజాగా వచ్చిన లోక్‌పోల్ సర్వేలో కాంగ్రెస్ కు మెజారిటీ సీట్లు దక్కనున్నాయని తేలింది. 119 సీట్లు ఉన్న తెలంగాణలో అధికారంలోకి రావడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు. అయితే ఈ 60 సీట్లు కాంగ్రెస్ చేరుకుంటుందని సర్వే తేల్చి చెప్పింది. 39-42 ఓటింగ్ శాతంతో బి‌ఆర్‌ఎస్ 45-51 సీట్లు గెల్చుకుంటుందని, 41-44 ఓటింగ్ శాతంతో కాంగ్రెస్ 61-67 సీట్లు గెలుచుకుంటుందని తేల్చి చెప్పింది.

ఇక బి‌జే‌పి‌కి 10-12 శాతం ఓటింగ్ వచ్చినా..కేవలం 2-3 సీట్లు మాత్రమే గెలుచుకునే ఛాన్స్ ఉందని తేలింది. అటు ఎం‌ఐ‌ఎం 3-4 ఓటింగ్ తో 6-8 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, ఇతరులు 3-5 ఓటింగ్ తెచ్చుకుని 0-1 సీటు గెలుచుకోవచ్చు అని అంచనా వేసింది. అయితే ఈ మధ్య వస్తున్న కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా వస్తున్నాయి. దీంతో ప్రజా తీర్పులో ఏమైనా మార్పు వస్తుందా? అనే పరిస్తితి కనిపిస్తోంది. చూడాలి మరి ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉంటారో.

Read more RELATED
Recommended to you

Latest news