యూఎస్ స్పేస్ క్యాంప్‌లో హైదరాబాద్ విద్యార్థి

-

హంట్స్‌విల్లేలో యూఎస్ స్పేష్ అండ్ రాకెట్ సెంటర్‌లో జరుగుతున్న రెండు వారాల లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌లో రోహిత్ పాల్గొన్నాడు. ఈ లీడర్ షిప్ ప్రోగ్రామ్‌లో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్, కోడింగ్, కంప్యూటర్ సైన్స్, ఆస్ట్రోనాటిక్స్ లాంటి సబ్జెక్టులలో ఎలా రాణించాలో నేర్పిస్తారు.

హైదరాబాద్‌కు చెందిన రోహిత్ తిరుమల శెట్టి అనే విద్యార్థి యూఎస్ స్పేస్ క్యాంప్‌కు సెలెక్ట్ అయ్యాడు. యూఎస్‌లోని హనీవెల్ లీడర్ షిప్ చాలెంజ్ అకాడమీలో సెలక్ట్ అయిన 17 మంది భారత విద్యార్థుల్లో రోహిత్ ఒకరు. లైఫ్ టైమ్ లర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం వాళ్లను సెలక్ట్ చేసుకున్నారు. మొత్తం 41 దేశాలకు చెందిన 292 మంది విద్యార్థులను ఈ స్పేస్ క్యాంప్ కోసం సెలక్ట్ చేసుకోగా.. అందులో హైదరాబాద్ నుంచి ఎంపికైన ఒకే ఒక విద్యార్థి రోహిత్. యూఎస్ స్పేష్ క్యాంప్‌కు గ్లోబల్ అంబాసిడర్లుగా సెలక్ట్ అయిన 8 మందిలో రోహిత్ ఒకరు.

హంట్స్‌విల్లేలో యూఎస్ స్పేష్ అండ్ రాకెట్ సెంటర్‌లో జరుగుతున్న రెండు వారాల లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌లో రోహిత్ పాల్గొన్నాడు. ఈ లీడర్ షిప్ ప్రోగ్రామ్‌లో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్, కోడింగ్, కంప్యూటర్ సైన్స్, ఆస్ట్రోనాటిక్స్ లాంటి సబ్జెక్టులలో ఎలా రాణించాలో నేర్పిస్తారు.

ఇలాంటి అవకాశం చాలా కొద్దిమందికి మాత్రమే లభిస్తుంది. ఒక స్టూడెంట్ మెంటర్‌గా స్పేస్ క్యాంప్‌కు సెలక్ట్ అవడం నా అదృష్టం.. అని రోహిత్ తెలిపాడు.

16 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న వాళ్లు మాత్రమే పాల్గొనే ఈ క్యాంపులో విద్యార్థులకు అనేక సవాళ్లు ఎదురవుతాయట. అసెంబ్లింగ్, కోడింగ్, రాకెట్ల టెస్టింగ్, ఆస్ట్రోనాట్ ట్రెయినింగ్ లాంటి ఎన్నో చాలెంజ్‌లను ఎదుర్కోవాలట. ఆ సవాళ్లన్నింటినీ పరిష్కరిస్తేనే వాళ్లు సక్సెస్‌ఫుల్‌గా స్పేస్ క్యాంప్ ట్రెయినింగ్‌ను పూర్తి చేసినట్టు.

ఈసంవత్సరం బెంగళూరు నుంచి ఏడుగురు, పూణె నుంచి ఎనిమిది మంది, ఢిల్లీ నుంచి ఒకరు, హైదరాబాద్ నుంచి ఒకరు హానీవెల్‌కు సెలక్ట్ అయ్యారు. ఇందులో సెలక్ట్ అవ్వాలంటే.. చాలా కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news