సందమామ కంచం ఒకటి కావాలి.. సందె బువ్వ తోడు కావాలి.. బువ్వని కోరుకుని రాసిన పాట బతు కుని దిద్దింది.బతుకుని మార్చిన పాట స్థాయిని పెంచింది. కొమ్మని తాకిన కోయిల ఒకటి మన చెంతకు చేరింది. వాడు గాయపడ్డ గుండెని ఓలలాడించు వేణువు.. మనో వేగం చెంత .. మానుష సరోవరం చెం త నడయాడు వాగ్దేవి..వాడే వేటూరి. తనకిక సాటేలేదనచు కీర్తినొసగు వేటూరి..ఆ.. గీతాంజలిని స్మ రించాలి.. రాలేటి రాగాలను ఏరుకొనగ ఏడు కొండల్లో బండగ నిలిచిన వాడి చెంత వీటిని చేర్చాలి.ఒక్క కీర్తన చాలునటగా ఆ.. ప్రభువుకి.. విభువుకి..వహ్!! వెళ్లొద్దాం.. ఆ పాట పుట్టిన చోటుకి..!
“ఏంటయ్యా ! నీకు తెలుసా పాట వేగంగా రాయాలి.. నీకు కుదురునా”కుదురు గా ఉన్న ఇసైజ్ఞాని కోపంగా అంతెత్తు మాట అన్నాడు. ఎంత వేగంగా రాసినాగ తి తప్పకూడదు.. అన్నది అన్యాపదేశం.. తెల్సుగా కొన్ని లుప్తాలు గుర్తించాలి క. కొన్ని చిరాకులు పరాకులు అలానే ఉండనీ.. పాట మాత్రం ఆత్రేయ దీవెన అందుకుని వస్తే ఆనందం.. రసమైత్రి కుదిరితే ఇంకా ఆనందం..”ఏంటయ్యా ! వేగంగా రాసేస్తు న్నావటగా”అన్నాడట ఆత్రేయ…”ఏదో మీ అంత కాదు”అని నవ్వేశాడట వేటూరి. ఆతడిని ఒక్కసారి స్మ రిస్తే అది భవతి వేదం/వితతినాదం.. ఉప్పొంగు గోదారి చెంత అదొక విలాసం/కొన్నింట విలాపం.. నే విన్నది ఓ విను తి..నే కన్నది ఓ ప్రస్తుతి.. వేటూరి పాటకు ఆయుష్షు ఎక్కువ.. ఆ స్వర పద సం గమ క్షేత్రానికి ప్రాశ్తస్యం ఇంకొంత ఎక్కువ.. అందుకు మహదేవన్ ఓ కారణం.. ఇళయరాజా మరో కారణం.. కీరవాణి లాంటి వారు ఆయనకు ఇంకాస్త తోడు.. అంతే!
రసధుని అని ఒకటి ఉంటుంది. అది వెలుగులీనితేనే అందం.కవితా వర్ఛస్సు పాటకు ఎంతగా ఒన గూరితే అంత అందం. ఆ పని వేటూరి చేశాడు.రాలిపోయే పువ్వుకు తోటమాలి తోడు లేదన్నాడు..వేణువై వచ్చి ఆ గాయాల హృదితో వా గ్గేయాలు రాశాడు. రాగల కాలంలో ఇలాంటోడు రాడు..వస్తే మేలు.”ఏం తగ్గింది మా రామయ్య భోగం”అని ప్రశ్నించుకుంటూనే పోతాడు.. ఆ గుప్పిట అక్షరాలు కొన్నింట నిగమార్థాలు.. ఆ పిడికిట తలంబ్రాలు సీతమ్మపై కురియుచు కురి యుచు తీసుకువచ్చెను సంతోష వాసంతాలు..
విశ్వనాథుడితో పనిచేసి “విశ్వనాథాష్టకం”రాశాడు.. పాటకు కావ్య గౌరవం ఇ చ్చాడు. ఇలాంటి గౌరవా న్ని ఇంకొంచెం కొనసాగించి తెలుగు తమిళ వైభవా లను మధుర మధుర మీనాక్షి అంటూ ఓ పాటలో స్తుతించాడు. వందేమాతరం పుట్టిన నేలని ఎంతగానో ఎంతగానో కీర్తించాడు.యమునా తీరాన ప్రణయము నా సమీరాలను మోసుకువచ్చాడు.
ఇవేవీ కాదు కానీ కావ్యం అనదగ్గ మాట ఒకటి జంధ్యాలకు నచ్చిందట!అదే ఆయన దృష్టిలో వాగ్గేయం అట!ఎంతగా మురిసిపోయాడో తానే రచించి ప్రచు రించిన “కొమ్మకొమ్మకో సన్నాయి”అనే పుస్తకంలో..
“జానకి కన్నుల జలధి తరంగం
రాముని మదిలో విరహ సముద్రం
చేతులు కలిపిన సేతు బంధనం – ఆ
సేతు హిమాచల ప్రణయ కీర్తనం సాగర సంగమమే
ప్రణవ సాగర సంగమమే…”
కొన్నింటికి తర్పణంవిడాలి..కొన్నింటిని తప్పక కోరుకోవాలి కానీ ఈ పాటను ఈ జలధిని ఈ ఉషస్సుని జీవితాంతం కాదు తెలుగు ఉన్నంత వరకూ.. వెలుగు ఉ న్నంత వరకూ భద్ర పరుచుకోవాలి..అటువంటి యోగం అందరికీ దక్కదు. న మామి వేటూరి.. స్మరామి వేటూరి..ఈ జయంతి వేళ మా నివాళులివే..ఆ.. కృ ష్ణాతీరానికి వందనమిదే..ఆ..సంగీత..సాహిత్య సంగమ క్షేత్రానికి జోతలివే.. సుందరరాముడు గొప్పవాడు..తెలుగులోగిలికి మరో రామావతారం అంతే!!
(సందర్భం : జనవరి 29, వేటూరి జయంతి)
– రత్నకిశోర్ శంభుమహంతి