ఎడిట్ నోట్ : వ‌ర్థిల్ల‌వ‌మ్మా! క‌ల్యాణ ల‌క్ష్మీ..థాంక్యూ కేసీఆర్

-

ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్న నేత‌గా కేసీఆర్ కు పేరు.అందుకే ఆయ‌న ఏం చేసినా కూడా పూర్తిగా క్షేత్ర స్థాయి వాస్త‌వాల‌కు అనుగుణంగానే ప‌నిచేస్తారు. ఒక్క‌సారి కూడా ఆయ‌న నిర్ణ‌యాలు దారి త‌ప్ప‌వు. నిధుల మంజూరులో కూడా పూర్తిగా ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఆ విధంగా త‌న విశ్వ‌స‌నీయ‌త చాటుతున్నారు.ఉద్య‌మ స‌మ‌యంలో తాను గుర్తించిన ఓ సామాజిక వెనుక‌బాటుకు ప‌రిష్కారంగా అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కేసీఆర్ ఇచ్చిన మాట ప్ర‌కారం క‌ల్యాణ ల‌క్ష్మీకి, అంత‌కుమునుపు షాదీ ముబార‌క్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి బ‌డుగు వ‌ర్గాల్లోనూ, అల్ప‌సంఖ్యాక వ‌ర్గాల్లోనూ ఆనందం నింపారు.ఆ విధంగా ప‌ది ల‌క్ష‌ల మందికి పైగా ల‌బ్ధిదారుల‌ను ఆయ‌న ఆదుకుని దేశంలోనే రికార్డు సృష్టించారు. పొరుగున ఆంధ్రాలో కూడా ఈ స్థాయి ప‌థ‌కం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణ వాకిట రెండు ప‌థ‌కాలు అమ‌లువుతూ దేశంలోనే ఆద‌ర్శంగా నిలుస్తున్నాయి.పేదింట కొత్త కాంతులు నింపుతున్నా యి.వివాహ వేడుక వేళ ఆ రెండు ప‌థ‌కాల కార‌ణంగా అటు బీసీల్లోనూ, ఇటు మైనార్టీల్లోనూ ఆనందాలు వ్యక్తం అవుతున్నాయి. బ‌డ్జెట్ కేటాయింపుల‌లో ఎనభై శాతానికి పైగా నిధులు వెచ్చిస్తూ అధికారులు ఆద‌ర్శంగా ఉంటున్నారు. వ‌చ్చే ద‌ర‌ఖాస్తుల‌లో ప్ర‌తి పదింటిలో,అర్హ‌త‌లు అనుస‌రించి ఎనిమిది ద‌ర‌ఖాస్తుల వ‌ర‌కూ ఓకే అవుతున్నాయి.

పేదింటి బిడ్డ‌ల‌కు క‌ల్యాణ ల‌క్ష్మీ ప‌థ‌కం ఎంత‌గానో ఆదుకుంటోంది.ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లువుతున్న ఈ ప‌థ‌కానికి దేశం న‌లుమూలల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. బీసీల‌కు చెందిన ఆడబిడ్డ‌ల‌కు అండ‌గా ఉండేందుకు, వివాహ వేళ మేన‌మామ కానుక‌గా రూ.51,000 ఇచ్చేవారు.ఇప్పుడ‌ది క్ర‌మేణా పెరిగి 1,00,116 రూపాయ‌ల‌కు చేరుకుంది.ఈ ప‌థ‌కం ద్వారా 10,56,239 కి సాయం అందించారు. మొద‌ట్లో మైనార్టీ యువ‌తుల‌కు మాత్ర‌మే అందించేవారు.త‌రువాత నిబంధ‌న‌లు మార్చి బీసీల‌కూ వ‌ర్తింప‌జే స్తున్నారు.ఆ విధంగా క‌ల్యాణ ల‌క్ష్మీ, షాదీ ముబారక్ అనే రెండు ప‌థ‌కాల‌ను అందిస్తున్నారు.దీంతో నిరుపేద‌ల‌కు ఈ ప‌థ‌కాలు ఎంత‌గానో అండ‌గా ఉంటున్నాయ‌న్న‌ది ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్న మాట.ఇప్ప‌టిదాకా ఈ ప‌థ‌కానికి  రూ.9,803.97 కోట్లు కేటాయించారు.అందులో రూ.8420.89 కోట్లు వెచ్చించారు.

Read more RELATED
Recommended to you

Latest news