కలర్ తోనే సినిమా కలర్ ఫుల్ గా ఉంటుందా..!బాలీవుడ్ లో ఇంత జాతివ్యత్యాసం ఎందుకో..

2020 మన అందరిని గడగడలాడించిందనే చెప్పాలి. దెబ్బమీద దెబ్బ ఎదుర్కున్నాం. ఒకదశలో మనవ మనుగడే ప్రశ్నార్థకందా మారింది. ఒక పక్క కరోనా, ఇంకోవైపు జాబ్ లేక రోడ్డున పడ్డ ఎంతోమంది జీవితాలు, ఇవీ చాలవన్నట్లు మిడతల దాడి..అబ్బో అవి అన్నీ చెప్పుకుంటే ఇప్పటికీ చాలమందికి వెన్నులో వణుకుపడుతుంది. అయినవాళ్లు చనిపోతే కడసారి చూడటానికి కూడా వీలులేని దీనస్థితి. మరోవైపు మనకు నచ్చిన నటీనటుల మరణాలు..ఇప్పుడు ఈ సమస్యల నుంచి మెల్లిమెల్లిగా బయటపడ్డాం. ఇవి అన్ని కంటికి కనిపించే సమస్యలు.. కానీ ఇప్పటికి ఒక సమస్య బాలీవుడ్ ఇండస్ట్రీనీ కుదిపేస్తుంది. ఏంటది అనుకుంటున్నారా..

Bollywood

టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ గ్లామర్ ఎక్కువ ఉంటుందని మనందరికి తెలుసు.. అక్కడి హీరోయిన్ల హాట్ హాట్ అందాల మనకంటే ఎప్పుడు ఒక మెట్టు పైనే ఉంటాయి. మంచి కథలు, సినిమా పాటలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. సినీ పరిశ్రమలో ఉండాలంటే అందం చాలా ముఖ్యమైనది. అందులోను తెల్లగా మెరిసే అందం ఉన్నవారికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అంతేందుకు మనం రోజు హమ్ చేసే బాలీవుడ్ పాటలనే తీసుకోండి. అందులో అందం గురించి చెప్పినప్పుడు చక్కగా తెల్లగా చంద్రబిబంబం వంటి ముఖం గల అమ్మాయి ఇలా అందాన్ని తెల్లదనం తోనే పోల్చుతున్నారు. హిందీ పదమైన ‘గోరి’ ప్రతి పాటలో తప్పక ఉంటుంది. అంటే మంచి తెల్లటి శరీరం కల స్ర్తీ అని అర్థం. అంటే తెల్లటి శరీరం గల వారే అందంగా ఉంటారని చెప్పకనే చెప్తుతున్నారు. జాతివ్యత్యాసం బాలీవుడ్ ఇండ్రస్ట్రీలో ఉన్న ప్రధాన సమస్య.. టాలీవుడ్ లో ఈ సమస్య లేదని చెప్పలేం కానీ..టాలీవుడ్ లేదా ఇంకా ఏ వుడ్ లో అయినా కలర్ కు అంత ప్రాముఖ్యత ఇవ్వరు..బాలీవుడ్ పాటల్లో ఉన్న వ్యత్యాసం మనకు మరెక్కడా కనిపించదు.

ఉదాహరణకు, గుమ్నామ్ సినిమాలోని “హమ్ కాలే హై టు” అనే పాటలో, మెహ్మద్ తన మంచి మనసును తన ముదురు చర్మాన్ని ముసుగు చేసే విధంగా ప్రదర్శించాడు. 1974 నాటి రోటీ నుండి “గోర్ రేంజ్ పె ఏ ఇత్నా” ఉంది, దీనిలో రాజేష్ ఖన్నా ముంతాజ్‌ని తన ఫెయిర్ స్కిన్ చూసుకుని అంత గర్వపడవద్దని చెప్తాడు..ఎందుకంటే స్కీన్ ఈజీగ్ టాన్ అవుతుంది . ఇంకా 2016లో బార్ బార్ దేఖో సినిమాలోనూ సిద్దార్థ్ మల్హోత్రా కత్రినా కైఫ్ యొక్క “వైట్ ఫేస్” కి ఒక సన్ గ్లాసెస్ ఎంత బాగా సరిపోతుందో పాడారు.

ఇలా చెప్పుకుంటే బాలీవుడ్ లో ఇలాంటి వ్యత్యాసాలతో కూడిన పాటలకు కొరత లేదు. “యే కాలి కాలి ఆంఖేన్” , బాలీవుడ్ నుండి వచ్చిన అతిపెద్ద పాటలలో ఒకటి, కాజోల్ యొక్క నల్లటి కళ్ళు మరియు తెల్ల బుగ్గలు చూసినప్పటి నుండి షారుఖ్ ఖాన్ తనని ఎలా పట్టుకోలేకపోయానా అని బాధపడతాడు. 1994 లో మెయిన్ కలీదు తు అనారీ సినిమాలో అక్షయ్ కుమార్,శిల్పా శెట్టి “చురకే దిల్ మేరా” పాటకు డ్యాన్స్ చేస్తారు. ఈ పాటలో ఆమె అక్షయ్ కుమార్ ని మెల్లగా ప్రేమలో పడేలా చేస్తుంది.. కేవలం తనకు తెల్లటి శరీరం ఉండటంతోనే ప్రేమపుట్టినట్లు చూపిస్తారు.

బాలీవుడ్‌లో జాత్యహంకారం(కలర్ డిఫరెన్స్)విషయానికి వస్తే ఇది పాటలకి మాత్రమే పరిమితం కాలేదు. ప్రముఖ హిందీ సినిమాల నుండి లెక్కలేనన్ని ముఖ్యమైన కథాంశాలు స్పష్టంగా జాతివివక్షతోనే వచ్చాయి. ఉదాహరణకు, 2008 ‘ఫ్యాషన్’ లో, మేఘనా మాథుర్ సినిమాలో ప్రియాంకచోప్రా తాగి ఆ మైకంలో ఆఫ్రికన్ వ్యక్తితో కలుస్తుంది. ఆమె మేల్కొన్నప్పుడు ఆమె పూర్తిగా ఆశ్చర్యపోయి,ఇంత నల్లగా ఉన్న తనని చూసి అసహ్యించుకుంటుంది . గోవింద మరియు రాణి ముఖర్జీ నటించిన ‘హద్ కర్దీ ఆప్నే’ చిత్రంలో, ఒక భారతీయ వ్యక్తి నల్లని ముఖంతో హోటల్ గదిలోకి వెళ్తాడు..అక్కడ తన భార్యను ఒక పురుష కథానాయకుడితో చూస్తాడు.ముగ్గురు ‘హవాయి’ భాషలో వాదించడం మొదలుపెడతారు, అయితే ఈ సీన్ ను అపార్థం యాంగిలో తిశారు. కానీ ఇక్కడ జాతి వ్యత్యాసం దాగి ఉంది.

2010 లో వచ్చినా హౌస్ ఫుల్‌ సినిమాలో బొమన్ ఇరానీ క్యారెక్టర్ తన మనవడిని చూసి నల్లగా ఉండటంతో ఒక రకమైన ఎక్ప్రషన్ ఇస్తుంది. ఛీ అన్నట్లు.ఇలా బాలీవుడ్ లో పాటల్లోనే కాదు.. సినిమా కథల్లోనూ కలర్ వేరియేషన్ చూపించే సీన్స్ చాలా ఉన్నాయి. భారతీయ చలనచిత్ర పరిశ్రమలలో పాటల్లో బ్యాక్ గ్రౌండ్ లో డ్యాన్స్ వేసే వాళ్లు కూడా రంగు రంగుల దుస్తులు ధరించిన తెల్లటి శరీరం కలవారినే పెడతారు. అంటే వారివల్లే పాటకు అందం మరింత పెరుగుతుందని వారు భావిస్తారు.

ఈరోజుకు కూడా దర్శకులు, నిర్మాతలు తెల్లటి శరీరం ఉన్నవారే సినిమాకు అందం తెస్తారనుకోవటం చాలా బాధకరమైన విషయం అనే చెప్పాలి. ఈ సమస్యలో తప్పు కేవలం సినిమా నిర్మించిన వాళ్లదే కాదు.. ప్రేక్షకులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. తెల్లగా ఉండేవారికే ఆకర్షితులవుతున్నారు ప్రేక్షకులు.

ఈ విషయం గురించి లోతుగా చర్చించేకొద్ది మనకు ఇలాంటి వ్యత్యాసంతో కూడిన సినిమాలు, పాటలు చాలానే కనిపిస్తాయి. వై నాట్ సినిమా మీరు చూసే ఉంటారు. గోధుమ రంగు కూడా బాలివుడ్ కు పట్టిన మరొక సమస్య.పూర్ బ్యాక్ గ్రౌండ్ నల్లగా చిత్రీకరించాలనప్పుడు తెల్లటి శరీరం కల నటులను నల్లగా మేకప్ వేయటంతో వారి కలర్ కు సమస్యలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. రంగు వివక్షత అనేది భారతదేశంలో ఉన్న కులవివక్షతకు మొదలు ఈ రంగే..నల్లగా ఉన్నవారిని దిగువ కులస్థులుగా పరిగణించారు. తెల్లగా ఉన్నవారిని అగ్రకులస్థులుగా పరిగణించారు. దాంతో సంపన్న దేశాల్లో అగ్రకులాల వారి పొలాల్లో దిగువ కులం వారు పనిచేయాల్సి వచ్చింది.

రణ్‌వీర్ సింగ్ మరియు హృతిక్ రోషన్ గల్లీ బాయ్, సూపర్ 30 లో తమ పాత్రల కోసం తమ చర్మాన్ని నల్లబడినా ఏం చేయలేకపోయారు.
అంతెందుకు ఇప్పుడు మార్కెట్ లో తెల్లని చర్మకోసం అనేక ఉత్పత్తులు ఉన్నాయి. వాటికోసం రకరకాల యాడ్స్ తీస్తుంటారు. మనకు తెలియకుండానే నల్లని చర్మం ఒక అసహ్యనికి సంకేతంగా మారుస్తున్నారు. అందం అంటే ఇలానే ఉండాలన్నట్లు వారు తీసే యాడ్స్ లో చూపిస్తారు. దానివల్ల నల్లగా ఉండేవారు ఎగబడి కొనటం ఫలితాలురాక బాధపడటం జరుగుతుంది.

ఇక్కడ తప్పు ఒకరిదే అని నిందిచలేము. .అందం అనేది కలర్ మీద ఆధరపడదు అనే నిజం అందరు గ్రహించాల్సి ఉంటుంది. చూసే విధానం మారినప్పుడే ఈ సమస్యకు అంతిమగీతం పాడినవాళ్లం అవుతాం.

vedha
శ్రీవేద రెడ్డి, D/O దిలీప్ రెడ్డి, 9 వ తరగతి, వాసవి పాఠశాల, నిర్మల్

తొమ్మిదో తరగతి చదువుతున్న నా మదిలో మెదిలిన ప్రశ్నలు ఇవి.. జాతివ్యత్యాసం గురించి ఈ వయసులోనే నేను తెలుసుకున్నా..కానీ ఈ సమస్య దర్శకులకు, సమాజానికి ఎందుకు అర్థంకావటంలేదో..
శ్రీవేద రెడ్డి, D/O దిలీప్ రెడ్డి, 9 వ తరగతి, వాసవి పాఠశాల, నిర్మల్.