లక్ష్యం కోసం పనిచెయ్యడం ఫలితాన్నిస్తుంది. డబ్బుకోసం పనిచేస్తే డబ్బు వస్తుంది. కానీ అలా డబ్బు రాని రోజున నీ ప్రయాణం ఆగిపోతుంది. కష్టపడే తత్వం ఉండి లక్ష్యం వైపు నడువ్.. పరిగెత్తు. నీతో ఎవరు పోటీ పడుతున్నారు.. నీ ముందెవరున్నారు.. నీ వెనుకెవరున్నారన్నది.. నీకవసరం.
ఒక లక్ష్యం – అదో యుద్ధం…. ఏకాగ్రత, పట్టుదల, నిజాయితీ, కష్టం… ఇవే అయుధాలు. అంతే… గెలుపు సులువు. ఆయుధాలు అవే అయినప్పుడు ఎవరైనా విజేతే. లక్ష్యాలు ఏవైనా, ఆయుధాలు మాత్రం అవే అయిఉండాలి. మనసావాచా కర్మణా ఆ లక్ష్యమే ఆలోచనగా ఉండాలి.
విజయానికి చేరువకావడం అంత సులువుగా అవుతుందా.. విజయాన్ని ఎవ్వడూ ఎప్పటికీ ఛేధించలేడు. ఎందుకంటే కొత్త కొత్త సవాళ్లు వస్తూనే ఉంటాయి.. అప్పుడు విజయం అనే పదం మనల్ని నడిపిస్తూనే ఉంటుంది.
విజయానికి ఫార్మలా ఇంకేదైనా ఉందా..?? అసలు ఏం చేస్తే విజయానికి చేరువవుతాం.. మొదటగా పక్కవారు ఏం చేస్తున్నారో చూడటం మానెయ్యాలి. ఎందుకంటే పక్కవారిని గమనిస్తూ పోతే కొన్నిరోజులకు మీరూ వారిలా చెయ్యడమే చేస్తారు. మీకున్న బలం మరిచి వేరే వారిలా ఉండటానికి కష్టంగా ఇష్ట పడతారు. పక్కవాడు తప్పు చేస్తే మీరు అదే చేసే పరిస్థితి వస్తుంది. ఆ పక్కవాడికి తెలుసు ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో తప్పు దొర్లితే వెంటనే సరిదిద్దుకుంటాడు. ఎందుకంటే వాడికి క్లారిటీ ఉంది. కానీ నీ అనుకరణ వల్ల పద్మవ్యూహంలో చిక్కినట్టవుతుంది. కాబట్టి నువ్వు నీలా ఉండూ.
నాకు మాత్రమే తెలుసు అనే గర్వం కూడా పనికి రాదు. అవసరమనుకున్నప్పుడు ఇతరుల సాయం పొందడం అవమానమేమీ కాదు. వారిలా మాత్రం చెయ్యలానుకోవద్దు.
తామేదో పెద్దగా ఎదిగిపోయాం.. ఎదిగోటివాళ్లను తొక్కేద్దామనుకోవడం సమయం వృధా.. అది మంచిది కూడా కాదు. రేపు మీపైన ఉన్నవాళ్లు మిమ్మల్ని తొక్కేస్తే.. పాతాళానికి పడిపోవడమే.. మాకన్నా తోపెవరూ లేరనుకుంటే పొరపాటే… సో తమతోపాటు తోటివారి మంచిని కాంక్షిస్తే అందరూ బాగుంటారు అందులో మీరు ఉంటారు.
ప్రయత్నమే విజయానికి తొలి మెట్టు.. స్పూర్తినిచ్చే కథ
ప్రయత్నమే తొలి మెట్టు.. కానీ విజయమే ఆకరి మెట్టు కాదు
– RK