మనతో మనమే జాగ్రత్త.. కొంచెం కష్టమే కానీ తప్పదు

-

ఖండాలు, దేశాలు దాటి పచ్చని గ్రామలపై పంజా విసురుతోంది కరోనా మహమ్మారి. ప్రేమ ఆప్యాయతలకు నెలవైన పల్లెటూళ్ళూ, గ్రామల్లో కరోనా కేసులు రావడం మొదలైంది.. ఇది తీవ్ర రూపం దాల్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.. అందరూ మనవాళ్ళే.. మనవాళ్ళ దగ్గర మనకెందుకు ఈ మాస్కులు, మనవాళ్ళే కదా ఎందుకు నాతో దూరంగా ఉంటున్నారనే ఆలోచనలు పక్కన పెట్టాల్సిన పరిస్థితి. కరోనా ఎవరికి ఎవరి వల్ల వచ్చిందో, వస్తుందో తెలియని సమయం. మనవల్ల మనవారికి గానీ మన అనుకునే వారికి గానీ రాకుండా చూసుకోవడం మన భాధ్యత.. ఇక చాలా కఠినంగా వ్యవహరించాలి.. మనకు మనమే హద్దులు పెట్టుకుంటే మనవారు సురక్షితం.. మనం సురక్షితం..

తెలిసిన వారే కదా అని వారి ఇంటికి వెళ్ళడం, ఏ వస్తువులు పడితే వాటిని ముట్టుకోవడం వద్దు. వాళ్ళతో మాట్లాడాలి అనిపిస్తే ఫోన్‌ కాల్ లేదా వీడియో కాల్‌ చేసి మాట్లాడం ఉత్తమం. మరీ కలవాల్సిన పరిస్థితి వస్తే ఆ విషయాన్ని ముందుగా ఫోన్‌ చేసి చెప్పడం మంచిది. ఇంటి ముందుకు వెళ్లి, బయటకు పిలిచి, మాస్కు ధరించి భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకొని కాసేపు మాట్లాడి వెళ్ళడం ఉత్తమం.

ఇక అమ్మల అక్కల ముచ్చట్లు పక్కన పెట్టి ఇంటికి పరిమితమవడం కంటే మంచి ఆలోచనలేదు.. ఇరుగుపొరుగువారు ఇచ్చే వంటకాలను తీసుకోవడం, మీ వంటకాలను ఇతర తినుబండారాలను ఇవ్వడం ఆపేద్దాం. వాళ్ళకు విషయం అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేస్తే వారు కూడా అర్థం చేసుకుంటారు.

స్నేహితులతో పిచ్ఛాపాటి ముచ్చట్లు, వాకింగ్‌ మానేసి, ఇంట్లోనే ఉంటూ యోగా, మెడిటేషన్‌ చేస్తూ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తే ఇమ్యూనిటీ పెరగటం జరుగుతుంది. మందు పార్టీలంటూ రోడ్లపై తిరగటం వద్దంటే వద్దు..

మొహమాటం వల్ల ఈ కరోనా వ్యాప్తి ఎక్కువ అవ్వొచ్చు.. మాస్కు పెట్టుకుంటే ఎదుటి వారిని తక్కువ చేసినట్టు కాదు.. సానిటైజర్‌ రాసుకుంటే దూరం పెడుతున్నట్లు కాదు.. మెహమాటం లేకుండా క్లియర్‌ గా ఉండండి..

ఇవి కొంచెం కష్టంగా అనిపించినా ఆ వ్యాక్సిన్‌ వచ్చే వరకు మాత్రం భరించాల్సిందే… ఆచరించాల్సిందే.. ఎందుకంటే.. మనం అనుకునే మనవారు ముఖ్యం… ఇప్పటికి మాత్రం హద్దులే మనకు కంచుకోటలు.. అందరూ బాగుండాలనేది మా అభిప్రాయం..

-RK

Read more RELATED
Recommended to you

Latest news