యుసిఐఎల్ లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

ప్రభుత్వ రంగ సంస్థలు తమ సంస్థల్లో ఉన్న వివిధ శాఖ లకు సంబంధించిన ఖాళీలను భర్తీ చేసెందుకు వరుస నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కంపెనీలు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.తాజాగా మరో సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.ప్రభుత్వరంగ సంస్థ యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు..

ఈ నోటిఫికేషన్ గాను మొత్తం 130 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న వాటిలో మైనింగ్‌ మేట్‌, బ్లాస్టర్‌, వైండింగ్‌ ఇంజన్‌ డ్రైవర్ తదితర అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. ఖాళీల పూర్తి వివరాలకు సంబంధించి మైనింగ్‌ మేట్ 80, బ్లాస్టర్ 20, వైండింగ్‌ ఇంజన్‌ డ్రైవర్‌ 30 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్ధుల నుంచి దరఖస్తులను కోరుతుంది.

పది, ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు ఈ పోస్టులకు అర్హులు..అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 30 సంవత్సరాలలోపు ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 6, 2022గా నిర్ణయించారు.ఈ ఉద్యొగాలకు సంబంధించిన పూర్తీ వివరాల కోసం www.upenergy.in పరిశీలించగలరు.నోటిఫికేషన్ ను పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేసుకోవడం మంచిది.