కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు, బీజేపీ పార్టీ సీటుకు నోటు అంటూ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఒకపార్టీ నేత ఏమో ఓటుకు నోటు కేసు దొంగ అని.. ఇప్పుడు ఆయనే కాంగ్రెస్ చీఫ్ అంటూ రేవంత్ పై సెటైర్లు వేశారు. ఇంకో పార్టీ నేతలేమో పదవుల కోసం కోట్లు డిమాండ్ చేసే పార్టీకి చెందినవారని… కర్ణాటకలో బీజేపీ సీఎం సీటుకు రు. 2500 కోట్లు ఇవ్వాలట అంటూ చురకలు అంటించారు.
ఆ పార్టీ ఎమ్మెల్యేనే మొన్న ఈ విషయం చెప్పారని… అలాంటి పార్టీలు అని.. ఒక పార్టీ ఓటుకు నోటు, మరొక పార్టీ సీటుకు నోటు అంటు ఎద్దేవా చేశారు. ఆయన జేపీ నడ్డా కాదు..అబద్ధాలకు అడ్డా అని ఫైర్ అయ్యారు. ఒకరేమో మోకాళ్ల యాత్ర..ఇంకొకరేమో పాదయాత్ర.మరోకరేమో సైకిల్ యాత్ర అంటూ బయలు దేరారని ఆగ్రహించారు.
కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదు అని సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా మీ కేంద్రమంత్రే చెప్పిండు.. కేంద్ర మంత్రులేమో కాళేశ్వరంతో తెలంగాణ పచ్చబడిదంటే నడ్డా ఏమో అవినీతి జరిగింది అంటుండని విమర్శించారు. ఏడేండ్ల కిందట పాలించింది కాంగ్రెస్ కాదా.. కాంగ్రెస్ అంటేనే ఎరువుల కొరత.* *కాంగ్రెస్ అంటేనే పవర్ కట్లు అంటూ ఫైర్ అయ్యారు. ఎరువుల కోసం..విత్తనాల కోసం కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడటం మరిచిపోయారా ? అని ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు మంత్రి హరీష్ రావు.