ముంబై లో ముగ్గురికి బ్లాక్ ఫంగస్ వచ్చిన తరువాత ‘Bone death’ సమస్యని గుర్తించిన వైద్యులు..!

-

బ్లాక్ ఫంగస్ Black fungus తర్వాత ముంబైలో ముగ్గురు పేషెంట్లు avascular necrosis లేదా death of bone tissues సమస్యతో బాధ పడుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా చాలా సమస్యలు వస్తున్నాయి. అయితే బ్లాక్ ఫంగస్ గురించి కూడా మనం చాలా విషయాలు విన్నాం. అయితే ఇప్పుడు అవాస్క్యులర్ నెక్రోసిస్ లేదా death of bone tissues కేసులు నమోదయ్యాయి.

బ్లాక్ ఫంగస్ /Black fungus
బ్లాక్ ఫంగస్ /Black fungus

బ్లాక్ ఫంగస్ తర్వాత ఈ సమస్య వచ్చిందని తెలుస్తోంది. ఇది ముంబైలో చోటు చేసుకుంది. బ్లాక్ ఫంగస్ వచ్చిన రెండు నెలలకు ఈ సమస్య వచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు. రాబోయే కొన్ని నెలల్లో ఇలాంటి కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

కరోనా వైరస్ కి ట్రీట్మెంట్ అందిన రెండు నెలలకి ముగ్గురు పురుషులకు ఈ సమస్య వచ్చిందని గుర్తించారు. femur bone లో నొప్పి కలిగిందని వైద్యుల్ని సంప్రదిస్తే లక్షణాలని గుర్తించారని డాక్టర్ సంజయ్ అన్నారు.

బ్లాక్ ఫంగస్ మరియు AVN సమస్య రావడానికి గల కారణం స్టెరాయిడ్స్ అని తేలింది. కరోనా వచ్చిన పేషెంట్లకి కార్టికో స్టెరాయిడ్స్ ఉపయోగిస్తున్నారని దీని కారణంగా ఈ సమస్య వస్తోందని అన్నారు.

ఇదిలా ఉంటే కోయంబత్తూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 264 మంది బ్లాక్ ఫంగస్ సమస్యతో బాధపడుతున్నారు. 30 మంది కంటిచూపును కోల్పోయారు. 110 మందికి విజువలైజేషన్ సర్జరీ చేయనున్నారు.

Amphotericin-B బ్లాక్ ఫంగస్ వచ్చే వాళ్ళకి ఉపయోగిస్తారని దీని కారణంగా ముక్కు, కళ్ళు, సైనసస్ మరియు బ్రెయిన్ కూడా డామేజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. భారతదేశంలో చాలా బ్లాక్ ఫంగస్ కేసులు ఇప్పటికి నమోదయ్యాయి. స్టెరాయిడ్స్ వల్ల ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది అని డాక్టర్లు అంటున్నారు

Read more RELATED
Recommended to you

Latest news